Meher ramesh: ఆ తమిళ్ హీరోతో సినిమా చేయడానికి కూడా ట్రై చేసిన మెహర్ రమేష్

Meher Ramesh

ఇండస్ట్రీలో హిట్ దర్శకులను గుర్తు పెట్టుకోవడం కామనే కానీ ఫ్లాప్ దర్శకులను కూడా ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటున్నారంటే ఒకటి ఆ దర్శకుడు విమర్శకులను మెప్పించే సినిమాలైనా తీస్తుండాలి లేక ఆయన తీసిన ప్రతి సినిమాకు విమర్శలపాలు అవుతునైన ఉండాలి ఈ రెండు కేటగిరీలలో రెండవ దాంట్లో మొదటి స్తానంలో ఉండే డైరెక్టర్ మెహర్ రమేష్.

తెలుగులో మెహర్ రమేష్ తీసిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్స్ గా నిలవగా, లేటెస్ట్ గా ఆయన మెగా స్టార్ చిరంజీవితో కలిసి తీసిన భోళా శంకర్ సినిమా కూడా తన కెరీర్ లో అయిదవ డిజాస్టర్ అవడానికి సిద్ధంగా ఉంది. మెగా స్టార్ చిరంజీవి సినిమా అంటే కేవలం మెగా ఫ్యాన్స్ చూసేలా తీసిన కూడా సినిమా హిట్ కొట్టేయచ్చు అని మూఢ విశ్వాసం తో మెహర్ రమేష్ వేసిన భోళా ప్లాన్ బోల్తా కొట్టిందనే చెప్పాలి.

ఇప్పటి వరకు మెహ రమేష్ తీసిన అయిదు సినిమాలు కూడా అడపదడపా హీరోల సినిమాలేం కాదు. అన్నీ సినిమాలు కూడా స్టార్ హీరోల బిగ్ బడ్జెట్ సినిమాలే.. మెహర్ రమేష్ ఎక్కువగా ప్రేక్షకులు గుర్తుండడానికి ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. అయితే మెహర్ రమేష్ శక్తి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని భోళా శంకర్ సినిమా తెరకెక్కించాడు.

- Advertisement -

అయితే నిజానికి మెహర్ రమేష్ చిరంజీవి కంటే ముందు మహేష్ బాబు తో సినిమా చేయాలనీ చాలా ప్రయత్నించాడట. కానీ మహేష్ బాబు, మెహర్ రమేష్ ప్రాజెక్ట్ ను వాయిదా వేస్తూ వచ్చాడు. దాంతో మెహర్ రమేష్ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అంత ఉపయోగించి తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ తో కూడా మూవీ చేయడానికి ప్లాన్ చేసాడట.

వారసుడు మూవీ షూటింగ్ హైద్రాబాద్ లో జరిగే సమయంలో మెహర్ రమేష్ విజయ్ ను కలిసి కథ కూడా వినిపించడట. కానీ విజయ్ మెహర్ రమేష్ సినిమాకు నో చెప్పడంతో, చివరికి మెగా స్టార్ చెంతకు చేరాడు.

మెగా స్టార్ కు మెహర్ రమేష్ దూరపు చుట్టం కావడంతో మెహర్ రమేష్ మాటను నమ్మి భోళా శంకర్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం భోళా శంకర్ పరిస్థితి ఎలా ఉందొ అందరికి తెలిసిందే. మొత్తంగా చూస్తే మహేష్ బాబు, తలపతి విజయ్ చాలా తెలివిగా మెహర్ రమేష్ గాలం నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు