NaaSaamiRanga: ఇంత హైప్ ఇస్తున్నారంటే అంజిని లేపేస్తారా ఏంటీ?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఈగల్ అధికారికంగా తప్పుకోగా, నాలుగు సినిమాలు అఫిషియల్ గా రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో నాగార్జున ‘నా సామిరంగ’ కూడా ఒకటి. పండక్కి వస్తున్న సినిమాల్లో అందరికంటే లాస్ట్ జనవరి 14న ఈ సినిమా ఈ సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది. పైగా పండక్కి వస్తున్న సినిమాల్లో పక్కా విలేజ్ నేటివిటీ సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలున్నాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమా మలయాళం హిట్ సినిమా ‘పోరింజు మరియం జొస్’ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇక తెలుగులో నాగార్జున తో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా సెకండ్ లీడ్ హీరోలుగా నటించారు. ముఖ్యంగా నాగార్జున అల్లరి నరేష్, ఇంకా హీరోయిన్ అశికా రంగనాథ్ చుట్టే ఈ కథ తిరుగుతుంది. అయితే ఈ సినిమాలో నాగార్జున పాత్ర చనిపోతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లో పోరింజు (హీరో) పాత్ర కూడా చనిపోతుంది. అలాగే తెలుగులో నాగార్జున పాత్ర కూడా చనిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు చేసినా, అందులో ఒరిజినల్ లా ఉన్నది ఉన్నట్టు చేయడం చాలా తక్కువ. నేటివిటీ పేరుతో స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ చేస్తారు దర్శకులు. అలాగే తెలుగు సినిమాల్లో హీరో చనిపోతే ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు. అలా చేసిన సినిమాలు చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. ముఖ్యంగా సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సినిమాల్లో ఇది చాలా జరిగింది.

- Advertisement -

అందువల్ల ఠాగూర్ లాంటి సినిమాల ఒరిజినల్ వెర్షన్ లలో క్లైమాక్ లో హీరో చనిపోతాడు. కానీ తెలుగులో దాన్ని ఛేంజ్ చేసి చిన్న పాటి జైలుశిక్షతో తప్పిస్తాడు. అలాగే నా సామిరంగ లో నాగార్జున చేసిన కిష్టయ్య పాత్ర చనిపోవాల్సి ఉండగా, తెలుగులో డైరెక్టర్ స్క్రిప్ట్ ఛేంజ్ చేసి ఆ పాత్రని బతికిస్తాడని తెలుస్తుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘నా సామిరంగ’ థీమ్ సాంగ్ లో నాగ్, నరేష్ మధ్య ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది.

అయితే ఆ పాట లిరిక్స్ వింటుంటే అల్లరి నరేష్ పాత్ర పైనే ఉన్నట్టు అనిపించింది. ఆ రకంగా నాగార్జున పాత్ర ని సేవ్ చేసి నరేష్ పాత్ర ని స్క్రిప్ట్ లో ఎండ్ చేసారా? అన్న డౌట్ వస్తుంది. లేదంటే ఇద్దర్ని సేవ్ చేసి ఒక ఘనమైన ముగింపు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. మరి నా సామిరంగ లో డైరెక్టర్ ఇద్దరిలో ఒక క్యారెక్టర్ ఎండ్ చేస్తాడా? లేక ఇద్దర్ని కాపాడి రొటీన్ స్టఫ్ ఇస్తాడా? అలా ఇచ్చినా స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ఆడియన్స్ ని కన్వీన్స్ చేస్తాడా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు