Nagarjuna Movie : “నా సామి రంగ” పూర్తి స్టోరీ ఇదే… హిట్ కళ కొట్టొస్తోంది

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా ఫ్యామిలీ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “నా సామి రంగ” ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ రొమాంటిక్ మూవీతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో నాగార్జునతో కన్నడ భామ ఆషికా రంగనాథ్ రొమాన్స్ చేయనుంది. కీలక పాత్రలో నటిస్తున్న మరో ఇద్దరు హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లకు జోడిగా మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్ కీలకపాత్రను పోషిస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగబోతున్న ఈ మూవీకి సంబంధించిన ఈ మూవీకి సంబంధించిన పూర్తి స్టోరీ ఏంటంటే?

“నా సామి రంగ” మూవీ 2019లో విడుదలైన “పొరింజు మరియం జోస్” అనే మలయాళ బ్లాక్ బస్టర్ మూవీకి రీమేక్ గా రాబోతోంది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో బోజు జార్జ్, చెంబన్ వినోద్ జోస్ హీరోలుగా నటించగా, జోషి దర్శకత్వం వహించారు. మలయాళ దర్శన్ స్టోరీ లోకి వెళ్తే… పొరింజు, జోస్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. పొరింజు మరియమ్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ విషయం చెప్పడానికి భయపడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఓ రోజు ఓ విద్యార్థి స్కూల్లో మరియమ్ ను ఏడిపిస్తాడు.

ఆ సమయంలో పొరింజు, జోస్ కలగజేసుకోవడంతో గొడవ జరిగి వారిద్దరూ చదువుకు దూరమవుతారు. ఆ తర్వాత జోస్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తాడు. పొరింజు బతుకు తెరువు కోసం మటన్ షాప్ నడుపుతూనే మరోవైపు ముతాళలి అనే రియల్ ఎస్టేట్ డీలర్ దగ్గర పని చేస్తాడు. ఆ రియల్ ఎస్టేట్ డీలర్ కు తన కొడుకుల కంటే పొరింజునే ఎక్కువగా నమ్ముతూ ఉంటాడు. ఇక ఈ నేపథ్యంలో మరియమ్ పొరింజును పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ అది ఆమె తండ్రికి ఇష్టం ఉండదు. దీంతో పొరింజుకు వార్నింగ్ ఇవ్వడానికి వెళ్లిన మరియు తండ్రి ప్రమాదవశాత్తు చనిపోతాడు. దీంతో మరియమ్ తన తండ్రి చావుకు కారణం అయ్యాడని రీజన్ తో పొరింజును ద్వేషిస్తుంది.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే ఒకరోజు చర్చి ఉత్సవాలు జరుగుతుండగా ముతాళలి మనవడు ప్రిన్స్ మరియంతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో గొడవ జరుగుతుంది. జోస్, పొరింజు ముతాళలి కొడుకుల్ని మనవడిని చితక్కొడతారు. కానీ అది చూసి కూడా ముతాళలి మౌనంగా ఉండడంతో ఆయన కొడుకులు ఆ ఇద్దరు స్నేహితులపై పగబట్టి చంపాలనుకుంటారు. దానికోసం వేరే ప్రాంతం నుంచి రౌడీలను తీసుకువచ్చి తన ఇంట్లోనే పెట్టుకుంటాడు ప్రిన్స్. ఈ క్రమంలో ఓరోజు థియేటర్లో జోస్ ను ప్రిన్స్ రౌడీలు చంపేస్తారు. ఆ తర్వాత పొరింజు తన స్నేహితుడిని చంపిన వారిపై ఎలా పగ తీర్చుకున్నాడు? చివరకు పొరింజు, మరియమ్ ఒకటయ్యారా లేదా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. సాధారణంగా క్లైమాక్స్ లో హీరో విలన్ ను చంపేస్తాడు.

కానీ ఈ సినిమాలో మాత్రం రూల్ బ్రేక్ చేసి హీరోను విలన్ చంపేస్తాడు. దర్శకుడు ఇచ్చిన ఈ ట్విస్ట్ కారణంగానే మలయాళం లో ఈ మూవీ పెద్ద హిట్ అయింది. సినిమా మొత్తం 1965-1985 మధ్యలో సింపుల్ పీరియాడిక్ లవ్ స్టోరీగా నడుస్తుంది. ఇక సినిమాలో కామెడీ ప్లస్ అయింది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. మరి ఈ కథ ప్రకారం చూసుకుంటే నాగార్జున చనిపోతాడా? ఈ కథకు డైరెక్టర్ తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయగలిగితే రీమేక్ అయినప్పటికీ హిట్ కావడం ఖాయం. ఈ కథను “నా సామి రంగ” టీం తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఎలాంటి మార్పులు చేర్పులు చేసి తీసారో తెలియాలంటే జనవరి 14 దాకా వెయిట్ చేయక తప్పదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు