Srikanth: శ్రీకాంత్ కూతుర్ని చూశారా? హీరోయిన్లు కూడా తక్కువే..?

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోగా.. ఫ్యామిలీ హీరోగా మంచి పేరు దక్కించుకున్న ఈయన బడా హీరోల సినిమాలలో ఇప్పుడు విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ముందుకు పోతున్నారు. ఇదిలా ఉండగా గతంలో ప్రముఖ నటి ఊహాను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆయన వారసుడు రోషన్ నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. పెళ్లి సందD సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం మలయాళం లో మోహన్ లాల్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు.

ఇకపోతే శ్రీకాంత్ చిన్న కొడుకు పేరు రోహన్, కూతురు మేధ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు తాజాగా శ్రీకాంత్ , ఊహా దంపతులు తమ పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అక్కడ శ్రీకాంత్ ఫ్యామిలీ ని చూసిన జనాలు వారితో ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపించగా.. శ్రీకాంత్ ఫ్యామిలీ కూడా వారికి సెల్ఫీలు ఇచ్చి ఆనంద పరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ ఫోటోలలో శ్రీకాంత్ కూతురు మేధా అందరిని ఆకట్టుకుంటుంది.. చీరలో సాంప్రదాయంగా.. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి అందరినీ అలరించింది.

సాంప్రదాయ దుస్తుల్లో మేధా ను చూసిన అందరూ అచ్చం తల్లిలాగే ఉంది.. ఈమె అందం ముందు హీరోయిన్లు కూడా తక్కువే.. ఇక హీరోయిన్గా ఎంట్రీ ఇస్తారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మేధా ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఊహ విషయానికి వస్తే.. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె.. సినిమాలలో నటిస్తూ ఉండగానే శ్రీకాంత్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం అనంతరం పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఊహా త్వరలోనే తన కూతుర్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అభిమానులు కోరుకుంటుండగా.. మరి శ్రీకాంత్ ఊహ దంపతులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఒకవేళ మేధా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనడంలో సందేహం లేదు.

- Advertisement -
Srikanth daughter medha meka photo  gone viral
Srikanth daughter Medha meka photo gone viral

 

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు