Mahabharat: ప్రశాంత్ వర్మ మహాభారతంలో టాలీవుడ్ స్టార్స్..మరి వీరి పరిస్థితేంటి వర్మ..!

మహాభారతం.. వెండితెరపై ఈ కథను ఎన్నిసార్లు చూసినా.. విన్నా తనివి తీరదు అని చెప్పవచ్చు. విన్న ప్రతిసారీ చూసిన ప్రతిక్షణం ఏదో తెలియని కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. అందుకే చాలామంది దర్శకులు ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాలని చూస్తున్నారు. అందులో నటించడానికి నటీనటులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు.. ఇక ఇందులో భాగంగానే ఇప్పటికే చాలామంది మహాభారతం సినిమాను వెండితెరపై చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కూడా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా మహాభారతం సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా హనుమాన్ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఈయన మహాభారతం ప్రాజెక్టుపై ఆసక్తికర కామెంట్లు చేశారు. జనవరి 12వ తేదీన ఈయన దర్శకత్వం వహించిన హనుమాన్ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అని తెలిపారు. ఇక మహాభారతం సినిమాను తాను తెర.. ఏ పాత్రకు ఏ హీరోని ఎంచుకుంటాడో కూడా వివరించారు.

శ్రీకృష్ణుడిగా మహేష్ బాబును ఎంపిక చేసిన ఈయన.. అర్జునుడి పాత్రకు రాంచరణ్ , భీముడి పాత్రకు ఎన్టీఆర్ ను, కర్ణుడి పాత్రకు పవన్ కళ్యాణ్, ధర్మరాజు పాత్రకు చిరంజీవిని తీసుకుంటానని అలాగే నకులుడుగా నాని,, సహదేవుడుగా విజయ దేవరకొండ, దుర్యోధనుడుగా మోహన్ బాబులను ఎంపిక చేసుకుంటానని తెలిపారు ప్రశాంత్ వర్మ. ఇక ప్రశాంత్ వర్మ ఈ మాట చెప్పడంతో ఈ హీరోల అభిమానులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ అల్లు అర్జున్ , ప్రభాస్ వంటి టాప్ హీరోల పేర్లు లేకపోవడంతో మరికొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారని చెప్పాలి. వీరిద్దరూ ఏం పాపం చేశారు అంటూ ప్రశ్నిస్తున్నారు కూడా.

- Advertisement -

ఇకపోతే ఎంతోమంది ఫిలిం మేకర్స్ కి డ్రీమ్ ప్రాజెక్ట్ గా మహాభారతం నిలుస్తోంది. ముఖ్యంగా అందులో కర్ణుడు, అర్జునుడు , భీముడు, భీష్ముడు, దుర్యోధనుడు పాత్రలకు కావలసిన అంత హీరోయిజం దట్టించి చూపించవచ్చు. అందుకే చాలామంది ఈ మహాభారతాన్ని తెరకెక్కించాలని తెగ తాపత్రయపడుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి కూడా మహాభారతం తన కలల ప్రాజెక్టు అని.. చాలా ఏళ్ల క్రితమే ప్రకటించారు. ఎప్పటికైనా మహాభారతం సినిమా తీస్తాను అని.. కాకపోతే ఆ సబ్జెక్టుని సిల్వర్ స్క్రీన్ పై డీల్ చేసేంత అనుభవం , పరిపక్వత ఇంకా రాలేదు అని వెల్లడించారు. మరి ప్రశాంత్ వర్మ తాను డిజైన్ చేసినట్టుగా పాత్రలను మహాభారతంలో ఎలా ప్రెసెంట్ చేస్తారో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు