Hanuman First Review: “హనుమాన్” ఫస్ట్ రివ్యూ

ఈసారి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద ఐదు స్ట్రైట్ సినిమాలు పోటీ పడడానికి రెడీగా ఉన్నాయి. స్టార్ హీరోల మధ్య జరుగుతున్న ఈ సంక్రాంతి పోరు తెలుగు ఆడియన్స్ లో ఆసక్తిని పెంచేసింది. మరి ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో విన్నర్ గా నిలిచేది ఎవరు అని ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సూపర్ హీరో “హనుమాన్” మూవీపై అందరి దృష్టి ఉంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా జనవరి 12న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా “హనుమాన్” మూవీ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. మరి మూవీ ఎలా ఉంది ? అంటే…

తాజాగా కొంతమంది సినీ ప్రముఖులకు “హనుమాన్” మూవీ స్పెషల్ షోలు వేయగా, ఈ మూవీ ఎలా ఉంది అనే టాక్ బయటకు వచ్చింది. ఇక “హనుమాన్” ఫస్ట్ రివ్యూ లోకి వెళ్తే… ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుందని అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ వరకు అలాగే ఉంటుందట. ఇక ఇంటర్వెల్ బ్లాక్ ఓకే అనిపిస్తుందని, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్ ఫర్వాలేదనిపిస్తుందనీ, కానీ ఆ తర్వాత కూడా మూవీ బోర్ కొడుతుంది అని టాక్ నడుస్తోంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఓవర్ ఆల్ గా యావరేజ్ బొమ్మ, హైప్ ని మ్యాచ్ చేసేలా అయితే ఉండదనీ, కానీ ఒకవేళ సినిమా నిలబడితే ప్రస్తుతం ఉన్న హైప్ వల్ల మంచి కలెక్షన్స్ మాత్రం రావచ్చనే మాట వినిపిస్తోంది. “హనుమాన్” మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సినీ ప్రియులకు ఇది చేదు వార్తే. అయితే ఈ టాక్ చూసాక ఈ యావరేజ్ సినిమాకు హైప్ అయితే బాగానే క్రియేట్ చేశారు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు “గుంటూరు కారం” మూవీతో దిగి, రిలీజ్ డేట్, థియేటర్ల గురించి ఇంత రచ్చ చేయడమే ఓవర్ గా అనిపిస్తోంది.

- Advertisement -

ఎవరి సినిమాలపై వాళ్లకు నమ్మకం ఉండడం మామూలే. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఉండకూడదు. “హనుమాన్” మూవీకి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అంత హైప్ క్రియేట్ చేశారు. ఒకవేళ మూవీలో నిజంగానే మంచి కంటెంట్ ఉండి ఉంటే అందరూ సలామ్ కొట్టేవారు. కానీ ఇప్పుడు మూవీకి ఈ టైం నుంచే నెగటివ్ రెస్పాన్స్ రావడం వల్ల “హనుమాన్” టీంకే నష్టం జరుగుతుంది. ఇప్పటిదాకా “గుంటూరు కారం”టీం తొక్కేస్తున్నారు తొక్కేస్తున్నారు అంటూ సింపతీని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఒకవేళ ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం సినిమా బాగా లేకపోతే నిజంగానే తొక్కేస్తారు.

టాలీవుడ్లో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది “గుంటూరు కారం” మూవీ రిలీజ్ అవుతుంది అని తెలిసినప్పటికీ జనవరి 12న “హనుమాన్” మూవీని కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించి తప్పు చేశారు మేకర్స్. ఈ మూవీని సోలో రిలీజ్ చేసి ఉంటే “హనుమాన్” హిట్ ను ఆపడం ఎవరి తరం అయ్యేది కాదు. ఒకవేళ యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ హైప్ వల్ల కలెక్షన్స్ కు మాత్రం ఢోకా ఉండేది కాదు. మరి ఇప్పుడు కావాలని మహేష్ “గుంటూరు కారం” మూవీకి పోటీగా సంక్రాంతి బరిలోకి దిగుతున్న “హనుమాన్” పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం సులువే.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు