Ram charan: అవమానంతో స్టేజ్ నుంచి దిగిపోయిన రామ్ చరణ్..!!

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఈమధ్య కాలంలో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించడంతో భారీగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. ఇటీవలే జామ్ నగర్లో అనంత్ అంబానీ – రాధిక మర్చెంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి.. దాదాపు మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగడంతో దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది టాప్ సెలబ్రిటీలందరూ అక్కడ పాల్గొన్నారు.. బాలీవుడ్ మొత్తం అంబానీ ఈవెంట్ లో కనిపించడంతో అటు అభిమానులు కూడా ఆనందపడ్డారు.. ముఖ్యంగా అందరూ కలిసి ఒకే చోట కనిపించడం దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాతే అవుతోంది..

రామ్ చరణ్ ను అవమానించిన షారుఖ్..
అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి మాత్రం రామ్ చరణ్ దంపతులు మాత్రమే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కి హాజరయ్యారు.. అయితే ఇదే వేడుకలలో రామ్ చరణ్ ని షారుఖ్ అవమానించినట్లుగా ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ బయటపెట్టింది.. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.. గతంలో ఇండియన్ చిత్రాలు అంటే కేవలం బాలీవుడ్ సినిమాలు అనే వాళ్ళం.. కానీ ఇప్పుడు టాలీవుడ్ సినిమాలనే ఇండియన్ సినిమాలని పిలుస్తున్నారు.. ముఖ్యంగా RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యారు.

అసలు నిజం చెప్పిన ఉపాసన మేకప్ ఆర్టిస్ట్..
తాజాగా అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు రామ్ చరణ్ కి ఆహ్వానం అందగా.. ఈ మేరకు సతీమణి తో కలిసి అక్కడ పాల్గొన్నారు..ఇక RRR సినిమాలోని నాటు నాటు పాటకు సల్మాన్, షారుఖ్, అమీర్ ఖాన్లతో స్టేజ్ పైన రామ్ చరణ్ డాన్స్ వేయడం జరిగింది.. అయితే స్టేజ్ పైకి పిలిచే సమయంలో చరణ్ ని ఇడ్లీ, వడ అని సంబోధించి షారుఖ్ పిలిచారనీ.. దీంతో కోపం వచ్చి స్టేజి నుంచీ దిగిపోయారని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జేబా హాసన్ చెప్పింది.. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఈమె షేర్ చేసింది.

- Advertisement -

షారుఖ్ ఖాన్ కి ధీటుగా నెటిజన్స్ ట్రోల్స్..
అయితే ఈ విషయం విన్న తర్వాత అందరూ షాక్ అవుతున్నారు.. ఈ సమయంలోనే బాలీవుడ్ హీరోలని వొడాఫోన్ బేల్ పూరి అని పిలిస్తే ఊరుకుంటారా అంటూ అభిమానులు సైతం షారుక్ ఖాన్ కు ధీటుగా కౌంటర్లు వేస్తున్నారు.. ఇలాంటి విషయాలు ఫన్నీగా చేసినా సరే షారుఖ్ ఇలా పిలవడం పై మెగా అభిమానులు సైతం చాలా ఫీల్ అవుతున్నారు.. అలాగే బాలీవుడ్ హీరోలు.. టాలీవుడ్ హీరోల రేంజ్ పెరిగిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని.. అందుకే ఇలా చేస్తున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ఫోటో కూడా వైరల్ గా మారుతోంది.. ఏది ఏమైనా సెలబ్రిటీలను ఇలా ఆహ్వానించి తోటి సెలబ్రిటీల ఆహ్వానించడం నిజంగా సిగ్గుచేటు అంటూ సౌత్ సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు