Samantha: వెబ్ సిరీస్ కోసం సమంత పారితోషికం అన్ని కోట్లా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఒక పక్క తన ఆరోగ్యం పైన దృష్టి పెడుతూనే మరొకపక్క సినిమాలు చేస్తూ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా గడిపేస్తోంది.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా కనిపిస్తూ పలు రకాల ఫోటోలను, కొటేషన్లను సైతం షేర్ చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఏం మాయ చేసావే సినిమాతో మొదటిసారి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది … ఆ తర్వాత తెలుగు, తమిళ్ వంటి భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి పేరు దక్కించుకోవడమే కాదు తెలుగు, తమిళ్ స్టార్ హీరోల సరసన నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

సమంత కెరియర్..
ఇప్పటికీ స్టార్ హోదాను అనుభవిస్తున్న సమంత తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కి కూడా కాస్త బ్రేక్ ఇచ్చేసింది.. ముఖ్యంగా తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో విడాకులు అనంతరం సమంత మయోసైటిస్ అనే ఒక ప్రాణాంతకమైన వ్యాధితో సతమతమవుతోంది. ఈ వ్యాధి నుంచి బయటపడడానికి సమంత ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతూనే ఉంది.. దీంతో ఈ ఏడాది ఏకంగా సినిమా షూటింగ్స్ అన్నిటికీ కూడా బ్రేక్ ఇచ్చి కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంది సమంత.

సిటాడెల్ వెబ్ సిరీస్..
దీంతో ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలో నటించడానికి ఒప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా అలా ఉంచితే సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి ముందు సిటాడెల్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది.. ఇది అమెరికన్ వెబ్ సిరీస్.. ఇండియన్ అడాప్షన్ గా దీన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజు అండ్ డీకే డైరెక్టర్ గా చేశారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్న తరుణంలో.. ఈ వెబ్ సిరీస్ లో నటించినందుకుగానూ సమంత అందరిని ఆశ్చర్యపరిచే లెవల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

సిటాడెల్ రెమ్యునరేషన్..
ఏకంగా ఈ వెబ్ సిరీస్ కోసం సమంత 10 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.. ఫ్యామిలీ మ్యాన్ -2 సిరీస్ తో వచ్చిన క్రేజ్ వల్ల పాన్ ఇండియా స్థాయిలో సమంత గుర్తింపు సంపాదించుకున్నది.. దీంతో ఈమె ఇంత డిమాండ్ చేస్తోంది.. అంతేకాదు ఈమె క్రేజ్ చూసి అడిగినంత ఇవ్వడానికి కూడా మేకర్స్ సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతానికి సమంత ఎలాంటి సినిమాలను మాత్రం ఒప్పుకోలేదు.. కానీ త్వరలోనే పలు రకాల ప్రాజెక్టులను కూడా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. మొత్తానికైతే వెబ్ సిరీస్ కోసం ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది ఈ ముద్దుగుమ్మ.. ఇక తదుపరి వచ్చే సినిమాలకు కూడా ఇదే రేంజ్ లో డిమాండ్ చేస్తుందా లేక మునుపటి పారితోషకంతో సరిపెట్టుకుంటుందో చూడాలి..

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు