The Goat Life : తెలుగు వెర్షన్ కు ఇదే అతిపెద్ద అడ్డంకి కానుందా?

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఆడుజీవితం – ది గోట్ లైఫ్”. డైరెక్టర్ బ్లేసీ దర్శకత్వంలో రూపొందిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ మార్చ్ 28న థియేటర్లలోకి రాబోతోంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ మలయాళం మూవీ అనేక వాయిదాలు, ఫైనాన్షియల్ కష్టాలను దాటుకుని ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతోంది. కానీ ఈ మూవీ తెలుగు వెర్షన్ కు మాత్రం అతిపెద్ద గండం పొంచి ఉంది. మరి దాని నుంచి పృథ్వీరాజ్ గట్టెక్కుతాడా? అంటే… మూడో ముప్పు…

అడ్వెంచరస్ సర్వైవల్ థ్రిల్లర్ “ఆడుజీవితం : ది గోట్ లైఫ్” ట్రైలర్ రీసెంట్ గా రిలీజై, సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఇప్పటికే “సలార్” మూవీలో ప్రభాస్ ఫ్రెండ్ గా కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కు టాలీవుడ్ ఆడియన్స్ కు వరదరాజ మన్నార్ గా మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే మార్చ్ 28న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తలకెత్తుకున్న మైత్రి మూవీ మేకర్స్ వారు. అయితే ఈ మూవీపై ఇప్పటికే టిల్లు స్క్వేర్, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమాల ఎఫెక్ట్ తప్పేలా లేదు. “ది గోట్ లైఫ్” రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే ఈ రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇది చాలదన్నట్టు రిలీజ్ అయ్యాక ఈ సినిమాకు మరో గండం పొంచి ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వర్షన్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం కష్టమే అనిపిస్తోంది. దానికి కారణం ఈ సినిమా రన్ టైం. దాదాపు 2 గంటల 53 నిమిషాల రన్ టైంతో ఈ మూవీ స్క్రీన్ పైకి రాబోతోంది. కానీ ప్రస్తుతం స్పీడ్ గా సాగే ఎంటర్టైనింగ్ సినిమాలనే జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో దాదాపు మూడు గంటల నిడివితో సాగే “ది గోట్ లైఫ్” మూవీ జనాలకు బోర్ ఫీలింగ్ తెప్పించొచ్చు. పైగా ఈ మూవీ సాగదీసినట్టుగా అనిపించే అవకాశం ఉంది. సినిమా మొత్తంలో ఎక్కువగా పృథ్వీరాజ్ మాత్రమే కనిపిస్తారు కాబట్టి ప్రేక్షకులు భరించడం కష్టమే. థియేటర్లలో ఆడియన్స్ ను కూర్చోబెట్టగలిగే సత్తా ఆ కథలో ఉంటే తప్ప ఈ మూవీ హిట్ అవ్వడం అసాధ్యం.

ఫస్ట్ రివ్యూ కూడా ఇదే చెప్తుందా?

- Advertisement -

మరోవైపు ఈ మూవీ ఫస్ట్ రివ్యూ కూడా ఇదే తేల్చేసింది. “ది గోట్ లైఫ్”ను థియేటర్లలో చూస్తున్న సమయంలో ఏదో డాక్యుమెంటరీని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అనే టాక్ నడుస్తోంది. మలయాళ ఆడియన్స్ సంగతి పక్కన పెడితే తెలుగు వాళ్లకు ఇలాంటి సినిమాలు నచ్చడం కాస్త కష్టమే. దీని నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ గట్టెక్కుతారా? లేక డిజాస్టర్ టాక్ తో నిరాశకు గురవుతారా? అనేది చూడాలి. కాగా “ఆడు జీవితం” మూవీని రచయిత బెన్యామిన్ రాసిన బుక్ ఆధారంగా అదే పేరుతో డైరెక్టర్ బ్లేసీ తెరకెక్కించారు. ఈ మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది. సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లి, బానిసగా, గొర్రెల కాపరిగా మారిన ఓ వ్యక్తి జీవిత కథ ఈ మూవీ. ఆ ఎడారి నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనేదే తెరపై చూడాల్సిన స్టోరీ. సినిమాలో పృథ్వీరాజ్, అమలాపాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా జిమ్మీ, రిక్ అబీ కీలక పాత్రలు పోషించారు. బ్లేసీ, జిమ్మీ జిన్ లూయిస్, స్టీఫెన్ ఆడమ్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు