Game Changer : RC 15 పై గూస్ బంప్స్ తెప్పించే దిల్ రాజు అప్డేట్.. రిలీజ్ డేట్ కూడా లాక్..

Game Changer : రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ అనే సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దర్శకత్వం వహిస్తూ ఉండగా.. ఎస్.ఎస్.థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ జె సూర్య, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

గేమ్‌ ఛేంజర్‌ నుంచీ జరగండి సాంగ్ రిలీస్..

ఇదిలా ఉండగా నిన్న రామ్ చరణ్ తన 39వ పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకున్నారు.. ఈ నేపథ్యంలోనే ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి జరగండి జరగండి అనే పాటను రిలీజ్ చేయడం జరిగింది.. నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.. ఇకపోతే ముందే ఈ పాట నుంచి కొన్ని లీకులు జరిగినప్పటికీ పాట మాత్రం హైలెట్ గా నిలిచింది. మాస్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించిందని చెప్పవచ్చు.. ప్రత్యేకించి కియారా అద్వానీ.. రాంచరణ్ డాన్స్ తో సరితూగుతూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిందని చెప్పాలి.. ఇద్దరూ కూడా ఆన్ స్క్రీన్ పై పోటీ పడుతూ చాలా అద్భుతంగా డాన్స్ చేశారు.

గేమ్‌ ఛేంజర్‌ విడుదల తేదీ వాయిదా…

ఇదిలా ఉండగా ఈ సినిమాలోని “జరగండి జరగండి” పాటకు సంబంధించి లాంచింగ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు.. అందులో భాగంగానే ఈ సినిమా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఇవ్వడం జరిగింది.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

గేమ్‌ ఛేంజర్‌ మూవీ పై దిల్ రాజు అప్డేట్స్..

సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ.. RRR తర్వాత వస్తున్న సినిమా కాబట్టి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ హీరో అయిపోయారు.. ఆ రేంజ్ కి సినిమా రీచ్ అవ్వాలంటే శంకర్ ఒక్కో పాటని , ఒక సీన్ ని ప్రత్యేకంగా చిత్రీకరిస్తున్నారు.. ఇంకొక నాలుగు నెలలు ఓపిక పడితే మీ ముందుకి గేమ్‌ ఛేంజర్‌ వస్తుంది..ఇంకో రెండు నెలల్లో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇక ఇప్పుడు జరగండి జరగండి పాట రిలీజ్ అయింది.. ఈ పాటలో మీరు చూసింది కేవలం 2% మాత్రమే.. ఇంకా 98% శంకర్ దాచి ఉంచారు. అది రేపు రిలీజ్ రోజు థియేటర్లలో చూసినప్పుడు ఆ సాంగ్ వర్త్ ఏంటో మీకు అర్థమవుతుంది.. ఈ ఒక్క పాట మాత్రమే కాదు ఇలా ఐదు పాటలను శంకర్ ఆయన స్టైల్ లో డిజైన్ చేసి పెట్టారు. మీ అభిమానులకు ఒక మూడు పాటలైతే సీట్లలో కూర్చొ నివ్వకుండా.. లేచి డాన్స్ చేసేలా చేస్తాయి. ఇంకొక 5 నెలలు నన్ను తిట్టుకోకుండా ఉండండి.. అక్టోబర్లో ఖచ్చితంగా సినిమాను మీ ముందుకు తీసుకొస్తాము.. ఇకపోతే గత కొన్ని రోజులుగా అభిమానులు, నెటిజన్స్ దిల్ మామ మాకొక అప్డేట్ ఇవ్వండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.. అయితే దిల్ మామ మీకు అప్డేట్ ఇవ్వలేడు. శాటిలైట్ నుంచి శంకర్ ఇది ఇవ్వు అని అన్నప్పుడే నేను మీకు అప్డేట్ ఇవ్వగలను.. ముందే ఎటువంటి లీకేజీలు నేను ఇవ్వలేను అంటూ దిల్ రాజు కామెంట్స్ చేశారు. మొత్తానికైతే సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు దిల్ రాజు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు