HBD Ram Charan : చెర్రీ ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను చేజార్చుకున్నాడా?

HBD Ram Charan : సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్లడం అనేది సర్వసాధారణం. కానీ చేసే ప్రతి సినిమా మీద వారి పేరు రాసి ఉంటేనే అది పట్టాలెక్కుతుంది. లేదంటే బ్లాక్ బస్టర్ కథలను చేజేతులా వదిలేసుకొని ఆ తర్వాత నాలుక కరుచుకుంటారు హీరోలు. అయితే మరికొన్ని సినిమాలను మాత్రం వదిలేసుకుని మంచిపనే చేసాం అనుకుంటారు. డిజాస్టర్ భారి నుంచి తప్పించుకున్నందుకు ఊపిరి పీల్చుకుంటారు. ఇదే విధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను చేజార్చుకున్నారు. ఈరోజు చెర్రీ పుట్టినరోజు (HBD Ram Charan) సందర్భంగా రామ్ చరణ్ తన కెరీర్ లో వదులుకున్న హిట్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

1. సూర్య సన్నాఫ్ కృష్ణన్

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన కల్ట్ క్లాస్ మూవీ సూర్య సన్నాఫ్ కృష్ణన్. గౌతమ్ మీనన్ తన జీవితంలో జరిగిన రియల్ స్టోరీస్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. సూర్య కెరీర్ లోనే బెస్ట్ మూవీగా మిగిలిపోయింది ఈ స్టోరీ. అయితే ముందుగా ఈ కథ రామ్ చరణ్ దగ్గరకు రాగా, ఆయన రిజెక్ట్ చేశారట. మగధీర సినిమాతో బిజీగా ఉండడం వల్ల చెర్రీ సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీని వదులుకోవాల్సి వచ్చిందట. ఈ మూవీతో పాటు గౌతమ్ మీనన్ మరో సినిమాను కూడా చెర్రీ రిజెక్ట్ చేశాడు. నాని, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన “ఎటో వెళ్లిపోయింది మనసు” మూవీకి ముందుగా రామ్ చరణ్ నే హీరోగా అనుకున్నారట. కానీ కథ నచ్చకపోవడంతో ఐదు నంది అవార్డులను అందుకున్న ఈ మూవీని చెర్రీ రిజెక్ట్ చేశాడు.

2. శ్రీమంతుడు

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ శ్రీమంతుడు. ముందుగా రామ్ చరణ్ వద్దకే శ్రీమంతుడు స్టోరీ వెళ్ళిందట. కానీ కథ నచ్చినప్పటికీ చెర్రీకి రిస్క్ అనిపించడంతో పక్కన పెట్టేసాడట. దాంతో మహేష్ దగ్గరకు వెళ్లిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా నాన్ బాహుబలి రికార్డును సాధించడం విశేషం.

- Advertisement -

3. లీడర్

రానా దగ్గుబాటి లీడర్ మూవీతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే శేఖర్ కమ్ముల ముందుగా స్టోరీని రామ్ చరణ్ కే వినిపించారట. చెర్రీ రిజెక్ట్ చేయడంతో అదే స్టోరీ బన్నీ దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత వెంకటేష్ దగ్గరకు వెళ్ళగా, రానాకు డెబ్యూ మూవీగా ఇదైతే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట. అలా చివరకు రానా కెరీర్ లోనే బెస్ట్ మూవీగా మిగిలిపోయింది లీడర్.

రామ్ చరణ్ తన 17 ఏళ్ల కెరీర్లో ఇప్పటిదాకా 14 సినిమాల్లో నటించగా కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయితే, మరికొన్ని డిజాస్టర్ గా నిలిచాయి. అయితే డిజాస్టర్ రేటు తక్కువే అని చెప్పుకోవచ్చు. ఈ నాలుగు సినిమాలతో పాటు చెర్రీ కృష్ణం వందే జగద్గురుం, కృష్ణార్జున యుద్ధం, నేల టికెట్ వంటి డిజాస్టర్ సినిమాలను, మనం, ఓకే బంగారం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను వదిలేసుకున్నారు. ఇందులోని కొన్ని సినిమాలను చెర్రీ గనక చేసి ఉంటే ఆ లెక్క వేరుగా ఉండేది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు