HBD Ram Charan : వేల కోట్ల ఆస్తులు… దిమ్మతిరిగే కార్ల కలెక్షన్

HBD Ram Charan : మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ లోని అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని పాన్ ఇండియా హీరోగా అదరగొడుతూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు చెర్రీ. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న చెర్రీ పుట్టినరోజు నేడు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు (HBD Ram Charan) వెల్లువెత్తుతున్నాయి. మార్చ్ 27న ఆయన పుట్టినరోజు సందర్భంగా చెర్రీ ఆస్తులకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

కోట్లాది ఆస్తులు, బిజినెస్ లు…

సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత చెర్రీ తనకంటూ సొంత ఆస్తులను కూడబెట్టుకోవడం మొదలుపెట్టాడు. 2007లో చిరుత మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన చెర్రీ ఇప్పటివరకు తన 17 ఏళ్ల సినీ కెరీర్లో 14 సినిమాల్లో హీరోగా నటించారు. అయితే సినిమా సినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటూ వచ్చి ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల లిస్ట్ లో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల నెట్ వ్యాల్యూ ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.1387 కోట్లు ఉంటుందని అంచనా. ఆయన సినిమాలు మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. ఇప్పటిదాకా ఆయన పెప్సీ, ఫ్రూటీ, హీరో మోటో క్రాప్, అపోలో జియో, టాటా డొకోమో వంటి దాదాపు 34 ప్రముఖ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఒక్కో యాడ్ కు చెర్రీ 3 నుంచి 4 కోట్లు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ట్రిపుల్ ఆర్ సినిమాకు 50 కోట్ల పారితోషకం అందుకున్న చెర్రీ ఇప్పుడు ఒక్కో సినిమాకు 100 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఖరీదైన బంగ్లా ఉంది చెర్రీ , ఉపాసన దంపతులకు. దీని విలువ దాదాపు 50 కోట్లు ఉండొచ్చని అంచనా. ముంబైలో కూడా సెలబ్రిటీ కపుల్ కు లగ్జరీ అపార్ట్మెంట్ ఉంది. చెర్రీ కేవలం హీరో మాత్రమే కాదు బిజినెస్ మాన్ కూడా. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలను నిర్మిస్తున్నారు. అలాగే చెర్రీకి ట్రూజెట్ అనే ఎయిర్ లైన్స్ సంస్థ కూడా ఉంది. మరోవైపు ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ హైదరాబాద్ జట్టుకు చెర్రీ యజమాని.

దిమ్మ తిరిగే కార్ల కలెక్షన్…

రామ్ చరణ్ 2013లోనే ఫోర్బ్స్ ఇండియాలో వంద మంది సెలబ్రిటీల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక ఆయన గురించి చెప్పుకోవాల్సిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఖరీదైన కార్ల కలెక్షన్. ఆడి మార్టిన్ v8 వాంటెజ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఫెరారీ ఫోర్టోఫినో, ఆస్టన్ మార్టిన్ వంటి కాస్ట్లీ కార్లు ఉన్నాయి చెర్రీ గ్యారేజ్ లో. వీటితోపాటు కస్టమైజ్డ్ మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ జిఎల్ఎస్ 600 కార్ కూడా ఉంది. దీని విలువ నాలుగు కోట్లు ఉంటుందని సమాచారం. తన సంపాదనకు తగ్గట్టే చెర్రీ టాక్స్ కట్టడంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు