Upasana: వామ్మో.. మెగా కోడలి ఆస్తి అన్ని వేల కోట్లా..?

గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ అనే బిరుదులతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఇక ఈయన సతీమణిగా ఉపాసన కొణిదెల కూడా అంతకుమించి పేరు సంపాదించుకున్నారనటంలో సందేహం లేదు. మెగా కోడలిగా కీర్తి పొందుతూనే.. సోషల్ మీడియాలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు.. అంతేకాదు సేవాగుణంతో కూడా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఈమె.. ఎక్కువగా కరోనా సమయంలో చాలామందికి సహాయాన్ని అందించి వెలుగులోకి వచ్చారు..ఇకపోతే మెగా ఇంట ఎలాంటి పండుగ జరిగినా.. ఏ ఈవెంట్ జరిగిన్నా.. అన్నీ తానై ముందుండి నడిపిస్తూ ఉంటారు.. అందుకే ఉపాసన అంటే అటు కుటుంబ సభ్యులకే కాదు ఇటు మెగా అభిమానులకు కూడా ఇష్టమే..

మెగా కుటుంబంలో అన్నీ శుభాలే..
రామ్ చరణ్ , ఉపాసన దంపతులకు గత ఏడాది మెగా ప్రిన్సెస్ క్లింకారా జన్మించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మెగా కుటుంబంలో ఏదో ఒక శుభవార్త వినిపిస్తూనే ఉంది. ఇక వరుసగా వరుణ్ పెళ్లి , చిరంజీవికి పద్మ విభూషణ్, చరణ్ కి గ్లోబల్ స్టార్ గుర్తింపు.. పైగా సురేఖ, ఉపాసన ఇద్దరూ కలసి అత్తమ్మాస్ కిచెన్ అనే సరికొత్త బిజినెస్ ని కూడా మొదలుపెట్టారు.. ఇలా వారింట్లో అన్నీ కూడా శుభకార్యాలే.. శుభవార్తలే.. ఇక దీంతో ఉపాసన కొణిదెల పేరు కూడా నెట్టింట ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది…

ఉపాసన ఆస్తులు..
ఇకపోతే తాజాగా ఉపాసన కొణిదెల పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. మెగా కోడలి పేరుపైన ఏకంగా రూ.1,130 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.. ఒకవైపు గ్లోబల్ స్టార్ సతీమణిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే.. మరొకవైపు రామ్ చరణ్ బిజినెస్లను అలాగే తన సొంత వ్యాపారాలను కూడా చూసుకుంటుంది.. పైగా ఇప్పుడు తన అత్తతో కలిసి అత్తమ్మాస్ కిచెన్ అనే ఒక సరికొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టారు.. తమ వంటింట్లో ఎలాంటి వంటలు అయితే వండుతారో.. అలాంటి రుచులు ఇప్పుడు అందరికీ రుచి చూపించడానికి సరికొత్తగా ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.. ఇలా ఒకటేమిటి అటు తల్లిగా.. ఇటు కోడలిగా.. మరొకవైపు భార్యగా.. ఇలా అన్ని బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు ఉపాసన.ఇకపోతే ఈమె కూడా సంపాదిస్తూ ఫైనాన్షియల్ ఫిట్ అనిపించుకుంటున్నారు.

- Advertisement -

రామ్ చరణ్ సినిమాలు..
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ మూవీను తెరకెక్కించి గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్న రాంచరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ సినిమాని చేస్తున్నారు.. ఈ సినిమాలోకి కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సనా కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.. ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రారంభించబోతున్నారు.. ఇప్పటికే నటీనటులను ఫైనలైజ్ చేస్తున్నట్లు సమాచారం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు