Rana: తెలుగు నుంచి రాబోయే గ్లోబల్ ఫిలిం అదే

ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వేరు. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్థాయి వేరు స్థానం వేరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక బిగ్ స్కేల్ లో సినిమా వస్తుంది అని అంటే ప్రపంచం మొత్తం ఎదురుచూస్తారు. ఎందుకంటే ఆ స్థాయికి చేరుకుంది తెలుగు సినిమా స్థాయి. తెలుగు సినిమాని విభజిస్తే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని చెప్పొచ్చు. బాహుబలికి ముందు కేవలం తెలుగు కలెక్షన్స్ కి మాత్రమే పరిమితమైన సినిమా, బాహుబలితో అసలు పాన్ ఇండియా అంటే ఏంటి అని తెలిసి వచ్చింది.

బాహుబలి తర్వాత చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. కానీ అన్నీ కూడా సాదాసీదాగా మాత్రమే ఆడాయి తప్ప బాహుబలి రేంజ్ ను మళ్ళీ టచ్ చేయలేకపోయాయి. మళ్ళీ బాహుబలిని టచ్ చేయాలంటే రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా దిగి రావాల్సి వచ్చింది. ట్రిపుల్ ఆర్ సినిమా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ట్రిపుల్ ఆర్ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనమంతా చూసాం.

ఎక్కడో ఉన్న ఆస్కార్ ని కూడా తెలుగు సినిమా పరిశ్రమ ముంగిట్లోకి తీసుకువచ్చింది ట్రిపుల్ ఆర్ సినిమా. ఒకప్పుడు ఆస్కార్ గురించి చదువుకునేవాళ్లం. తర్వాత ఆస్కార్ గురించి విన్నాం. తర్వాత ఆస్కార్ ను పొందుకున్నాం. ఇది తెలుగు సినిమా అచీవ్ చేసిన మూమెంట్ అని చెప్పొచ్చు. దీనికి కారణం ఎస్ ఎస్ రాజమౌళి. రామ్ , భీమ్ అనే రెండు పాత్రలను క్రియేట్ చేసి ఎస్.ఎస్.రాజమౌళి సృష్టించిన సంచలనం చాలామందికి నిద్ర లేకుండా చేసింది. చాలా రోజులపాటు ఆ సినిమా వెంటాడింది.

- Advertisement -

ఇకపోతే బాహుబలి ట్రిపుల్ సినిమాలను బీట్ చేసే గ్లోబల్ సినిమా ఇప్పటివరకు రాలేదు. అలానే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి కూడా ఆ స్థాయి హిట్ లేదు. బాహుబలి తర్వాత సలార్ మినహా వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కొద్దీపాటి నిరాశనే మిగిల్చాయి అని చెప్పొచ్చు.

ఇక అసలు విషయానికొస్తే ట్రిపుల్ ఆర్,బాహుబలిని కొట్టే సినిమా ఒకటి తెలుగు నుంచి రాబోతుంది అంటూ దగ్గుపాటి రానా ఒక వేదికపై మాట్లాడుతూ వచ్చారు. అదే కల్కి ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 6000 సంవత్సరాల కాలాన్ని ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఆ సినిమాలో మనిషిని మనిషిలోని వ్యక్తిత్వాన్ని చూపించి చిన్న చిత్రమైన కూడా అద్భుతంగా అందంగా తీసి తనకంటూ ఉన్న ప్రత్యేకమైన శైలిని తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఆ తర్వాత మహానటి సావిత్రి బయోపిక్ ని తెరకెక్కించి ఒక సినిమాను ఇలా కూడా తీయొచ్చు, సినిమాకు ఆడియోన్స్ రావడం మానేశారు అనే అపోహను తొలగించేలా థియేటర్లను నింపాడు.

ఇకపోతే ఇప్పుడు కల్కి సినిమా గురించి కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎట్టకేలకు మళ్ళీ బాహుబలి రికార్డులను ఈ సినిమా కొడుతుందని రానాతో పాటు యావత్ దేశమంతా మంచి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుంది. అమితాబచ్చన్, కమల్ హాసన్ వంటి పెద్ద పెద్ద స్టార్లు ఈ సినిమాలో కనిపించనున్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు