OTT Telugu Movies : ఈ వారం ఓటిటిలో డోంట్ మిస్ తెలుగు సినిమాలు ఇవే

ఈ వారం తెలుగు ఓటిటి ప్రియులకు సినిమా పండగే. కొన్ని మోస్ట్ అవైటింగ్ తెలుగు సినిమాలు ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. రవితేజ “ఈగల్” వంటి పెద్ద సినిమాతో పాటు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి క్రేజీ సినిమాల కూడా ఈ వారం ఓటీటిలో సందడి చేస్తున్న సినిమాల లిస్ట్ లో ఉంది. తెలుగు మూవీ లవర్స్ కి ఈ వీకెండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాబోతోంది. మరి ఇంతకీ ఏ సినిమా, ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కాబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈగల్ – మార్చ్ 1న
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “ఈగల్”. ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. రవితేజ నటనకు మంచి మార్కులు పడ్డప్పటికీ, మూవీ ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. యాక్షన్, థ్రిల్లర్ సినిమాలను ఎంజాయ్ చేసే సినీ ప్రియులు “ఈగల్” మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మార్చ్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఈటీవీ విన్ ద్వారా ఓటిటి లవర్స్ ముందుకు వచ్చేసింది ఈ మూవీ.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ – మార్చ్ 1న
సుహాస్ హీరోగా నటించిన హిట్ మూవీ “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు” మూవీ ఆహలో స్ట్రీమింగ్ కు రెడీగా ఉంది. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజ్ అయి, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. మార్చ్ 1 నుంచి ఆహాలో మల్లిగాడి డప్పుల మోత మొదలైపోయింది.

- Advertisement -

ఈ రెండు సినిమాలు ఇప్పటికే ఓటిటిలోకి అందుబాటులోకి రాగా, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి రెండు దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో కేవలం రెండు రోజుల్లోనే మొత్తంగా 14 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మార్చ్ 1 ఏకంగా 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఇవన్నీ హిందీ, ఇంగ్లీష్, తెలుగు డబ్బింగ్ సినిమాలు కావడం విశేషం. “మమ్లా లీగల్ హై” అనే హిందీ వెబ్ సిరీస్ మార్చ్ 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. ఇక మిగతా వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీస్ విషయానికి వస్తే… ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ, క్రికెట్ నేపథ్యంలో రూపొందిన “బ్లూ స్టార్” మిస్ అవ్వకుండా చూడాల్సిన లిస్ట్ లో ఉన్నాయి.

“హనుమాన్” స్ట్రీమింగ్ మరింత లేట్
సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజ్ అయి, ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టిన మూవీ “హనుమాన్”. తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను ఎంతో మంది థియేటర్లలో ఆస్వాదించినప్పటికీ, మరోసారి ఓటీటీ లో ఎప్పుడెప్పుడు వీక్షిస్తామా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన “హనుమాన్” మార్చ్ 2 నుంచి ఓటిటిలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఈ మూవీని మహాశివరాత్రి కానుకగా మార్చి 8న రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు