Netflix : బిగ్గెస్ట్ సినిమాలన్నీ నెట్ ఫ్లిక్స్ చేతిలోనే..

ప్రస్తుతం ఇండియాలో ఓటిటికి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. అయితే టాలీవుడ్ లో ఉన్న బడా సినిమాల కోసం రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మధ్య మాత్రమే గట్టి పోటీ నెలకొంటుంది. ఒకటి నెట్ ఫ్లిక్స్, ఇంకోటి అమెజాన్ ప్రైమ్. అయితే ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ దూకుడు ముందు అమెజాన్ చతికిలపడిపోయింది. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలన్నీ నెట్ ఫ్లిక్స్ చేతిలోనే ఉండడం విశేషం. ఇది నిజంగా అమెజాన్ ను నెట్ ఫ్లిక్స్ కొట్టిన చావు దెబ్బ అని చెప్పొచ్చు. ఇంతకీ నెట్ ఫ్లిక్స్ చేతిలో ఉన్న ఆ పాన్ ఇండియా సినిమాలు ఏంటి? అంటే…

నెట్ ఫ్లిక్స్ కే పాన్ ఇండియా మూవీస్ రైట్స్
2024లో నెట్ ఫ్లిక్స్ హవా మామూలుగా లేదు. పాన్ ఇండియా సినిమాల కోసం భారీగా చెల్లిస్తూ, కనీసం ఇతర ఓటిటి ప్లాట్ ఫామ్స్ తమకు పోటీగా రాలేవని ప్రూవ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సౌత్ లో రూపొందుతున్న పలువురు బడా స్టార్స్ సినిమాల రైట్స్ అన్ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న “పుష్ప 2”, ఎన్టీఆర్ “దేవర”, కమల్ హాసన్ “ఇండియన్ 2”, తలపతి విజయ్ “గోట్”, అజిత్ “విడాముయార్చి” సినిమాల డిజిటల్ రైట్స్ ను తన ఖాతాలో వేసుకుంది నెట్ ఫ్లిక్స్. మరో మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా మూవీ “కల్కి” డిజిటల్ రైట్స్ కూడా నెట్ ఫ్లిక్స్ చేతికే చిక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే “సలార్” మూవీ ఓటిటీ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకోగా, నెంబర్ 1 ట్రెండింగ్ మూవీగా రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన “పుష్ప” బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీ రైట్స్ ను అప్పట్లో అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అలాగే “పుష్ప”తో ఇండియన్ ఆడియన్స్ లో అమెజాన్ బాగా రీచ్ పెరిగింది. మొదటి పార్ట్ తో భారీ సంఖ్యలో సబ్ స్క్రైబర్లను పెంచేసుకున్న అమెజాన్, ఇప్పుడు మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న సీక్వెల్ “పుష్ప 2” డిజిటల్ రైట్స్ ను చేజార్చుకోవడం ఆశ్చర్యకరం.

- Advertisement -

సాధారణంగా ఇండియాలో సినిమాల పరంగా వీలైనంత ఎక్కువ మంది స్టార్ హీరోల సినిమాలను కొనుగోలు చేసి, ఓటిటిలో ఫాస్ట్ గా రిలీజ్ డేట్స్ ను ఇచ్చేసే అమెజాన్ ప్రైమ్ తీరు ఇప్పుడు మన్ను తిన్న పాములా ఉంది. ఇదే అదనుగా నెట్ ఫ్లిక్స్ రెచ్చిపోతుంది. వరుసగా బడా స్టార్ల సినిమాలన్నీ పట్టేసి, సోషల్ మీడియా వేదికగా తమ సబ్స్క్రైబర్లను మరింతగా పెంచుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అమెజాన్ కు ఈ రెండేళ్లు చిన్నా చితకా సినిమాలతో సరిపెట్టుకోక తప్పదు అనిపిస్తోంది. అమెజాన్ ఒకవేళ బాలీవుడ్ బడా సినిమాల రైట్స్ ను సొంతం చేసుకునే ప్లాన్ వేసినా, వాళ్ళ సినిమాల పరిస్థితి గత కొంతకాలంగా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి దానివల్ల అమెజాన్ ప్రైమ్ కు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు