Rashi Khanna : మేకర్స్ కళ్ళకు ఈ అందాల రాశి కనిపించట్లేదా?

టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. “పక్కా కమర్షియల్” అనే సినిమాతో చివరిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశికి ఆ మూవీ నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఈ అమ్మడు మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. కానీ ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను పలకరిస్తోంది. గతేడాది “ఫర్జీ” అనే వెబ్ సిరీస్ తో అటు హిందీతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా ఈ బ్యూటీ ఆకట్టుకుంది. కానీ మేకర్స్ కళ్ళకు ఈ అందాల రాశి ఎందుకు కనిపించట్లేదు? అనేది ఆమె అభిమానులు అడుగుతున్న ప్రశ్న.

హీరోయిన్ నుంచి ఓటిటికి…
“ఊహలు గుసగుసలాడే” మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. మొదటి సినిమాతోనే ఈ అమ్మడు మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకొని బిజీ హీరోయిన్ గా కొనసాగింది. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించిన రాశికి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ రాకపోవడం గమనార్హం. “జై లవకుశ” సినిమాలో మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కింది. కానీ అందులో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో క్రెడిట్ అంతా ఎన్టీఆర్ కు ఆ తర్వాత హీరోయిన్ నివేదకు దక్కింది. అనంతరం సాయి ధరం తేజ్ తో కలిసి నటించిన రాశి ఖన్నా “ప్రతిరోజు పండగే” మూవీతో హిట్ అందుకుంది. కానీ ఆ మూవీ కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపును ఇవ్వలేకపోయింది. దీంతో అవకాశాలు కరువై ఓటిటి ఎంట్రీ ఇవ్వక తప్పలేదు రాశికి. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన “ఫర్జి” అనే వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది రాశి ఖన్నా. ఇందులో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

సోషల్ మీడియాకే పరిమితం
ఇక ఇప్పుడు రాశి చేతిలో పలు సినిమాలు ఉన్నప్పటికీ ఆమెపై బడా మేకర్స్ కన్ను పడకపోవడం విచిత్రం. అందం, అభినయం, ఒడ్డూ పొడుగూ ఉన్నప్పటికీ రాశికి బడా స్టార్స్ సినిమాలలో అవకాశాలు రావట్లేదు. బాగా బరువు తగ్గేసి, అందాల ఆరబోతకు రెడీ అని సిగ్నల్స్ ఇస్తున్నప్పటికీ అవి పెద్ద డైరెక్టర్స్ కళ్ళకు కనిపిస్తున్నట్టు లేదు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలోనే ఈ అమ్మడు అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసి కుర్రకారు నిద్ర చెడగొడుతున్న ఈ అందాల రాశి మేకర్స్ ను మాత్రం ఎంత ప్రయత్నించినా ఆకట్టుకోలేకపోతోంది. దీంతో ఆమె అభిమానులు అసలు రాశికి ఏం తక్కువ? అని ప్రశ్నిస్తున్నారు. ఎవరెవరో ముక్కు మొహం తెలియని హీరోయిన్లను తీసుకొచ్చి, ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారని, కానీ ఈ అందమైన ముద్దుగుమ్మ ముందరే ఉన్నా పట్టించుకోవట్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు ఆమె కూడా పాన్ ఇండియా హీరోయిన్ గా అదరగొడుతుందని అంటున్నారు.

- Advertisement -

రాశి సినిమాల విషయానికి వస్తే….
ప్రస్తుతం రాశి చేతిలో పలు తెలుగు, హిందీ సినిమాలు ఉన్నాయి. తెలుసు కదా, యోధ, ది సబర్మతి రిపోర్ట్, టిఎంఈ అనే సినిమాల్లో రాశి హీరోయిన్ గా నటిస్తోంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు