Rashi Khanna: రాశి ఖన్నా చేసిన పనికి కియారా అద్వానీ ఫ్యాన్స్ అసహనం..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న కియారా అద్వానీ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా బాలీవుడ్ హీరో సిద్ధార్థ మల్హోత్రా ను ప్రేమించి మరీ గత ఏడాది వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. పెళ్లి తర్వాత ఫెస్టివల్ సమయంలో చాలా స్పెషల్ గా తయారవుతూ అభిమానులను ఖుషీ చేస్తూ ఉంటారు ఈ జంట.. దీంతో బాలీవుడ్ లో కియారా – సిద్ధార్థ్ లవ్లీ కపుల్ గా పేరు సంపాదించారు.. ఇదిలా ఉండగా తాజాగా ఒక వీడియో ఇప్పుడు కియారా అభిమానులను సైతం బాధపెట్టేలా చేస్తోంది. వాటి గురించి చూద్దాం.

సిద్ధార్థ్ మల్హోత్రా టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా , దిశా పఠాని కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం యోధ.. ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ తో తెగ సందడి చేసింది. ఈ సమయంలోనే రాశి ఖన్నా, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి రాజస్థాన్ జైపూర్ లో జరిగిన మొదటి సాంగ్ లాంచ్ ఈవెంట్లో కూడా పాల్గొన్నారు.. ఆ సమయంలోనే రాశి ఖన్నా, సిద్ధార్థ్ కెమిస్ట్రీ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వీరి మధ్య కెమిస్ట్రీ.. పాటలో కంటే సాంగ్ లాంచ్ ఈవెంట్ లోనే చాలా హైలెట్ గా మారిందని నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు..ఈవెంట్లో రాశి ఖన్నా, సిద్ధార్థ్ ఒకరి చేతిని ఒకరు పట్టుకొని చట్టపట్టలేసుకొని నడవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియోని చూసిన కియారా సైతం కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఆన్ స్క్రీన్ పైన ఇలా కనిపిస్తే బాగానే ఉంటుంది.. కానీ ఆఫ్ స్క్రీన్ పైన ఇలా కనిపించడం కరెక్ట్ కాదంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

చూస్తూ ఉంటే మ్యారేజ్ కపుల్స్ లా.. అలా ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుస్తున్నారనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని చూసి కియారా అభిమానులు ఈ జంటను ప్రశ్నిస్తున్నారు.. మరి ఈ విషయం పైన కియారా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.. ప్రస్తుతం కియారా సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్లో రామ్ చరణ్ తో కలిసి గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశి ఖన్నా సినిమాల విషయానికొస్తే..తెలుగులో సినిమాలు చేయక చాలా కాలం అవుతోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు