Shruthi Haasan : లోకేష్ తో శృతి రొమాంటిక్ సాంగ్… కమల్ షాకింగ్ రియాక్షన్

ప్రస్తుతం ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా కొనసాగుతున్న స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తాజాగా “ఇనిమేల్” అనే సాంగ్ తో అందరూ చూపు తన వైపుకే తిప్పుకున్న విషయం తెలిసిందే. ఆ వీడియో సాంగ్ లో శృతిహాసన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో చేసిన రొమాన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ముఖ్యంగా లోకేష్ తన నుంచి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని షేడ్ ను బయటపెట్టారు. ఆ వీడియో సాంగ్ లో శృతిహాసన్ తో ఊహించని విధంగా రొమాన్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు. తాజాగా ఈ వీడియోని చూసి తన తండ్రి కమల్ హాసన్ ఎలా రియాక్ట్ అయ్యాడు అనే ఆసక్తికరమైన విషయాన్ని శృతిహాసన్ బయట పెట్టింది. మరి ఇంతకీ “ఇనిమేల్” వీడియో సాంగ్ ను వీక్షించిన తర్వాత కమల్ హాసన్ రియాక్షన్ ఏంటి? అంటే…

కమల్ రియాక్షన్ ఇదే…

ఇన్నాళ్లు మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్ గా తెర వెనుక అదరగొట్టిన లోకేష్ కనగరాజ్ “ఇనిమేల్” మ్యూజిక్ ఆల్బమ్ లో హీరోగా కూడా ఆకట్టుకున్నాడు. ఈ పాటకు లోకనాయకుడు కమల్ హాసన్ లిరిక్స్ అందించడం విశేషం. అంతేకాదు రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ స్వయంగా నిర్మించారు. ఇక శృతిహాసన్ ఇందులో నటించడంతో పాటు మ్యూజిక్ కంపోజ్ చేసి, పాటను కూడా పాడింది. మొత్తానికి ఈ పాటతో లోకేష్, శృతిహాసన్ అదరగొట్టారు. సాంగ్ లో ఇద్దరు ప్రేమికులు డేటింగ్ యాప్ ద్వారా కలుసుకోవడం, ప్రేమలో మునిగిపోవడం, ఆ తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం, వర్క్ లో బిజీ అవ్వడం కారణంగా గొడవలు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. చివరకు మళ్లీ ఇద్దరూ ఒక్కటవుతారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, దానిపై తన తండ్రి ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయాన్ని శృతిహాసన్ తాజాగా వెల్లడించింది. తమ జంట తన తండ్రి కమల్ హాసన్ కు బాగా నచ్చిందని, నాలుగు నిమిషాల్లోనే ఒక కపుల్ మధ్య ఉండే రిలేషన్షిప్, అందులోని ఎమోషన్స్ అన్నింటిని చూపించామని చెప్పుకొచ్చింది. రిలేషన్ షిప్ లో ఉండే ఎత్తు పల్లాలు అన్ని తమ సాంగ్ లో చూపించామని వెల్లడించింది. తనకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టమని, ఇప్పుడు ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంతోషంగా ఉందని, ఈ సాంగ్ ను చూసాక కపుల్ తమ రిలేషన్షిప్ లోని లోటుపాట్లను సరిదిద్దుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది శృతిహాసన్. అయితే ఈ వీడియోలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో శృతిహాసన్ రొమాన్స్ అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. ఇప్పటిదాకా ఎన్నో సినిమాల్లో నటించిన శృతిహాసన్ ఈ రేంజ్ రొమాంటిక్ సన్నివేశాల్లో మాత్రం ఇప్పటిదాకా కనిపించలేదు.

- Advertisement -

శృతి, లోకేష్ సినిమాల విషయానికి వస్తే…

ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత “ఖైదీ 2″తో బిజీ కానున్నారు. మరోవైపు శృతిహాసన్ వరుసగా సినిమాలు చేస్తోంది. డెకాయిట్, సలార్ 2 సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2, ఇండియన్ 3 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. రీసెంట్ గా ఆయన “కల్కి” మూవీ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు