Anasuya : కోటా పై మళ్లీ కామెంట్స్ చేసిన అనసూయ.. లౌక్యంగా ఉండడం తెలీదు అంటూ..!

Anasuya : సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల మాటలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం.. ఒకసారి తమకు నచ్చినప్పుడు తమను తిట్టిన వారిని కూడా ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ నచ్చకపోతే అసలు అక్కడ విషయం ఏమీ లేకపోయినా నానా రచ్చ చేస్తూ ఉంటారు . ఇప్పుడు అలాంటి వారిలో యాంకర్ అనసూయ కూడా చేరిపోయిందని చెప్పాలి. బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు తాజాగా చేసిన కామెంట్లు ఈమెను మళ్లీ వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి..

కోట శ్రీనివాసరావు పై యాంకర్ అనసూయ కామెంట్స్ వైరల్..

సినిమా అవకాశాలు లేక వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న కోట శ్రీనివాసరావు.. ఒకానొక సమయంలో అనసూయ అంటే ఎవరో తనకు తెలియదని కామెంట్లు చేశారు .. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆమె డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం అయ్యాయి. అనసూయ (Anasuya)..ఆ అమ్మాయి వేసుకునే పొట్టి బట్టలు ఏంటండీ.. అంటూ ఒక ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు.. అలాంటి బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా కామెంట్లు చేశారు.. అప్పుడు కోట వ్యాఖ్యలకి అనసూయ గట్టి కౌంటర్ ఇచ్చింది.. బట్టలు అనేవి వ్యక్తిగత విషయం.. ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు దుస్తులు ధరిస్తారు.. ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఇలా చీప్ కామెంట్స్ చేయడం ఏంటి అంటూ అనసూయ బదులిచ్చింది.. దీంతో ఈ వివాదం సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయిన విషయం తెలిసిందే..

అప్పుడేమో చీప్ గా.. ఇప్పుడేమో..

అయితే ఈ వివాదం జరిగి రెండేళ్లు గడుస్తోంది.. ఇప్పుడు మరోసారి అనసూయ ఈ వివాదం గురించి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ కోటా శ్రీనివాసరావు గురించి మంచిగా మాట్లాడింది.. ఆ సంఘటన జరిగిన తర్వాత కోటా శ్రీనివాసరావు నాతో మాట్లాడారు. నా ఇంట్లో బిడ్డలుగా భావించి అలా చెప్పానని అన్నారు.. కాకపోతే అలా పబ్లిక్ ఫ్లాట్ ఫామ్ లో చెప్పడం తప్పే అని ఆయన కూడా ఫీలయ్యారు. కోటా లాంటి సీనియర్ నటులు నాకు క్షమాపణ చెప్పడంతో చెమటలు పట్టేసాయి.. ఆయన చాలా గొప్ప నటులు ఎన్నో నెగటివ్ రోల్స్ చేసి అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించారు.. కానీ పాపం ఆయనకి డిజిటల్ యుగంలో లౌక్యంగా ఉండడం అర్థం కాలేదు.. అందుకే అలా మాట్లాడారు.. కానీ కొంతమంది ఆయన మాటలను అడ్వాంటేజ్ గా తీసుకొని నన్ను ట్రోల్ చేశారు అంటూ అనసూయ తెలిపింది.. మొత్తానికైతే అప్పుడేమో చీప్ కామెంట్స్ చేసి ఇప్పుడేమో కోటాను ప్రశంసించడంతో అనసూయ ఊసరవెల్లి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.. అవసరానికి తగ్గట్టుగా మారిపోతుంది అంటూ కామెంట్లు చేయడం గమనార్హం . మరి దీనిపై అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి..

- Advertisement -

అనసూయ కెరియర్..

జబర్దస్త్ లో యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టి సత్తా చాటుతోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పుష్ప సినిమాలో దాక్షాయినిగా నటించి పాన్ ఇండియా స్టేటస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు