Naveen Polishetty : హీరో నవీన్ పోలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్… తీవ్ర గాయాలు?

Naveen Polishetty : జాతి రత్నాలు సినిమాతో పాపులర్ అయిన టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఈ హీరో బైక్ స్కిడ్ అయ్యి జారిపడ్డాడని తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే వివరాల్లోకి వెళితే…

అమెరికాలో యాక్సిడెంట్…

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి 2023లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. డి మహేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీని వంశీ, ప్రమోద్ నిర్మించారు. కలెక్షన్ల పరంగా ఈ మూవీ పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత నవీన్ తన నెక్స్ట్ మూవీ విషయంలో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో అనగనగా ఒక రాజు అనే సినిమాను చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ అయ్యింది అన్న వార్త వైరల్ అవుతుంది. నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం అమెరికాలో ఉండగా, అక్కడ బైక్ డ్రైవ్ చేస్తూ జారి పడిపోయాడని తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంలో చేతికి బలమైన గాయం అయ్యిందని, కోలుకోవడానికి రెండు నెలల సమయం పడుతుందని సమాచారం. నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ అయ్యింది అన్న వార్త బయటకు రావడంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కానీ అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. నవీన్ పోలిశెట్టి తన యాక్సిడెంట్ గురించి స్పందిస్తేనే గాని ఈ విషయంపై క్లారిటీ రాదు. రెండు రోజుల క్రితం ఈ ప్రమాదం జరగగా, ఆయన తన టీంకు ఫోన్ చేసి విషయం చెప్పేదాకా ఇండస్ట్రీలో ఒక్కరికి కూడా ఈ యాక్సిడెంట్ గురించి తెలియకపోవడం గమనార్హం. ప్రస్తుతం సీతారా బ్యానర్లో తెరకెక్కుతున్న తన మూవీ పని మీదనే ఆయన అమెరికాకు వెళ్లినట్టు సమాచారం.

నవీన్ పోలిశెట్టి సినిమాల విషయానికి వస్తే…

మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు అనే సినిమా తెరకెక్కుతోంది. మ్యాడ్ మూవీ కంటే ముందే అనగనగా ఒక రాజు మూవీ థియేటర్లలోకి రావాల్సి ఉంది. దాదాపు రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. కానీ పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. కొంతకాలం షూటింగ్ జరిగిన తర్వాత, అనివార్య కారణాలవల్ల ఆగిపోయింది. మరి ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది అనే విషయం గురించి అప్డేట్స్ ఏమీ లేవు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే ప్రచారం కూడా జరిగింది. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోందని ప్రకటించారు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి ఖాతాలో మూడు సినిమాలు ఉన్నాయి. సితార బ్యానర్ లో ఒక సినిమా చేస్తుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ యాక్సిడెంట్ కారణంగా చేతికి తీవ్ర గాయం కావడంతో డాక్టర్లు నవీన్ ను రెస్ట్ తీసుకోమని సూచించారట. కాబట్టి మరో రెండు నెలల తర్వాత గాని ఆయన సెట్ లోకి అడుగు పెట్టే అవకాశం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు