Sree Leela: హీరోయిన్ కు కాల్ చేసి గెలుకుతున్న శ్రీ లీల ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. కొంతమంది చాలా కష్టపడితేనే ఇండస్ట్రీలో రానిస్తారు. ఇక మరి కొంతమంది ఒక సినిమాతోనే బంపర్ హిట్ కొడతారు. అలా కొట్టిన వారిలో చాలామంది ఉన్నారు హీరోయిన్లు. అలాంటి హీరోయిన్లలో శ్రీ లీలా ఒకరు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్, యంగ్ బ్యూటీ శ్రీ లీలా గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీ లీల

టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి హీరోయిన్లుగా మారిన వారు చాలామంది ఉన్నారు. అచ్చం అలాగే హీరోయిన్ శ్రీ లీల కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేశారు. 2017 సంవత్సరంలో చిత్రంగాధ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది శ్రీ లీల. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో కిస్ అనే సినిమాలో మెరిసింది.

- Advertisement -

టాలీవుడ్ లో ఎంట్రీ
కన్నడ ఇండస్ట్రీలో రెండు సినిమాలు చేసిన తర్వాత పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీల. 2021 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కొడుకు సరసన హీరోయిన్గా నటించిన హీరోయిన్ శ్రీ లీల. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా… హీరోయిన్ శ్రీ లీల కు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. దాంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసే ఛాన్స్ వచ్చింది.

2022 సంవత్సరంలో ధమాకా సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది హీరోయిన్ శ్రీ లీల. రవితేజ సరసన అతనికి పోటీగా ఈ సినిమాలో మెరిసింది శ్రీ లీల. హీరో రవితేజ కూడా ఆశ్చర్యపోయేలా స్టెప్పులు వేసింది. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో… దాదాపు అరడజన్ సినిమాలు చేసేసింది హీరోయిన్ శ్రీ లీల.

అయితే ధమాకా తర్వాత వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో హీరోయిన్ శ్రీ లీల డిజాస్టర్ హీరోయిన్ గా మారిపోయే ప్రమాదం కూడా వచ్చేసింది. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు సరసన చేసిన గుంటూరు కారం పెద్దగా ఆడకపోయినా… కలెక్షన్స్ మాత్రం వసూలు చేయగలిగింది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా అయినా పక్క హిట్ కొట్టే ఛాన్సులు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది ఇలా ఉండగా హీరోయిన్ శ్రీ లీల గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ హీరోయిన్ కి తరచూ ఫోన్ చేస్తూ గెలుకుతోందట హీరోయిన్ శ్రీ లీల. హీరోయిన్ రష్మికకు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమెను సోషల్ మీడియాలో చాలామంది ఫాలో అవుతారు. కానీ శ్రీ లీల మాత్రం… అసలు ఫాలో కావడం లేదట. దీంతో రష్మిక ఫ్యాన్స్ శ్రీ లీలను ఇబ్బంది పెట్టారట. దీంతో వెంటనే రష్మిక కు ఫోన్ చేసి… మీ ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిందట శ్రీ లీలా. నాది తప్పు అయింది అంటూ వేడుకుందట శ్రీ లీల. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు