Naveen Vijay krishna: తండ్రి 4 పెళ్ళిళ్ళ పై స్పందన.. పెద్దముదురే..!

ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ ఒకప్పుడు హీరోగా పలు చిత్రాలలో నటించి కామెడీ హీరోగా పేరు దక్కించుకున్నారు.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. నరేష్ ఒకవైపు సినిమాల ద్వారానే కాకుండా.. మరొకవైపు తన వ్యక్తిగత జీవిత విషయంలో కూడా వార్తల్లో నిలుస్తున్నారు.. ఈ క్రమంలోనే ఆయన నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే.. ఇక తాజాగా ఈ విషయంపై ఆయన కొడుకు దర్శకుడు నవీన్ విజయ్ కృష్ణ క్రేజీగా స్పందించడంతో తండ్రిని మించిన కొడుకు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు..

తండ్రి 4 పెళ్లిళ్లపై కొడుకు కామెంట్స్..
తాజాగా నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ ( మొదటి భార్య కొడుకు) మాట్లాడుతూ.. “అది ఆయన వ్యక్తిగత నిర్ణయం.. అందులో నేను జోక్యం చేసుకోదల్చుకోలేదు. ఆయన ఎక్కడ సంతోషంగా ఉంది అనిపిస్తుందో అక్కడికి వెళ్తున్నారు.. తన సంతోషాన్ని తానే వెతుక్కుంటున్నారు” అని తెలిపారు… పెళ్లిళ్ల విషయం నాకు కూడా చెప్పారు.. కానీ నాకెందుకు చెబుతున్నారు అని, మీకు ఏది రైట్ అనిపిస్తే అది చేయమని నేను చెప్పాను.. ఒకప్పుడు నానమ్మ విజయనిర్మల కూడా అదే చెప్పేవారు అంటూ తెలిపారు నవీన్..లైఫ్ లో ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళదని.. వాళ్లే డిజైన్ చేసుకోవాలి అని ..నాన్న కంటే బయట చాలా మంది చాలా పెళ్లిళ్లు చేసుకుంటారు.. వాళ్ళవి ఇంకా వివాదంగా ఉంటాయి.. కానీ అవి మాత్రం బయటకు తెలియదు.. అయితే నాన్న పబ్లిక్ ఫిగర్ కావడంతో ఇప్పుడు అన్నీ బయటకి వస్తుంటాయి.. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు… నాన్న పెళ్లిళ్ళ ద్వారా సమాజానికి ఏం చెబుతున్నారనే వాదన కూడా ఇప్పుడు వినిపిస్తోంది. అయితే ఆయన నుంచి నేను తీసుకున్న సందేశం ఏమిటంటే… జీవితంలో ఎప్పుడు ఎక్కడ రాజీపడకూడదు.. నీ సంతోషం నీకు కావాలంటే ఇతరులను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపో.. వద్దంటే అక్కడే ఆగిపో అనేది మాత్రమే నేను ఆయన నుంచి స్పూర్తిగా తీసుకొని నా జీవితంలో ముందడుగు వేశాను అంటూ నవీన్ విజయకృష్ణ వెల్లడించారు..

లైఫ్ పార్ట్నర్ విషయంపై క్లారిటీ..
ఇకపోతే పెళ్లి విషయంలో నాకు కూడా అలాంటి ఆఫర్ ఇచ్చారు నాన్న. నీ లైఫ్ ని నువ్వే చూసుకో అని చెప్పారు.. నువ్వు నీకు నచ్చిన అమ్మాయిని చూసుకొని చెబితే.. మేము పెళ్లికి వచ్చి అక్షింతలు వేసి పోతామని చెప్పారు.. నానమ్మ విజయనిర్మల కూడా అలాంటి మైండ్ సెట్ తోనే ఉండేది.. అదే విషయమే చెప్పేది.. ముఖ్యంగా గ్రాండ్ వెడ్డింగ్ అంటే నాకు నచ్చదు.. కోట్లు పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటారు.. కానీ పెళ్లయిన కొద్ది రోజులకే విడిపోతారు. ఇక వాటికెందుకు కోట్లు ఖర్చు పెట్టడం అంటూ కూడా నవీన్ ప్రశ్నించారు.. మొత్తానికైతే తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నారు నవీన్ విజయ్ కృష్ణ ..

- Advertisement -

నవీన్ చిత్రాలు..
ఈయన రెండు చిత్రాలలో హీరోగా చేయగా.. అందులో ఒకటి విడుదల కాలేదు. మరొకటి విడుదలై పర్వాలేదనిపించుకుంది ..ఇకపోతే ఇటీవలే సాయి ధరంతేజ్ , కలర్స్ స్వాతి ప్రధాన పాత్రల్లో సత్య అనే షార్ట్ ఫిలిం రూపొందించారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు