SSMB -29: మహేష్- రాజమౌళి మూవీలో హృతిక్ రోషన్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా రిలీజ్ చేసిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమాని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే.. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాపై తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం అనే చెప్పాలి. ఈ చిత్రంతో వరల్డ్ వైడ్ ఇమేజ్ సొంతం చేసుకున్న రాజమౌళి తన తదుపరి చిత్రం ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తారో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు వరల్డ్ సినీ లవర్స్.. ఈ నేపథ్యంలోనే ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా నుంచి రోజుకు ఒక అప్డేట్ అభిమానులలో అంచనాలను పెంచేస్తుందని చెప్పవచ్చు.అందులో భాగంగానే తాజాగా ఈ సినిమాలో హృతిక్ రోషన్ నటిస్తున్నారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది..

రాజమౌళి – మహేష్ కాంబో మూవీలో హృతిక్ రోషన్..
సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ప్రకారం మహేష్ బాబుతో బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ స్క్రీన్ పంచుకోబోతున్నారని సమాచారం . ఈ క్రమంలోనే తాజాగా హృతిక్ రోషన్ రాజమౌళిని కలిశారట.. ఇక ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో విలన్ పాత్ర కోసం హృతిక్ ని సంప్రదించారని సమాచారం.. ఒకవేళ అన్నీ కుదిరితే ఒకే స్క్రీన్ పై ది మోస్ట్ హ్యాండ్సం ఇండియన్ యాక్టర్స్ ఇద్దరిని ఒకేసారి చూడవచ్చు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు నెటిజన్లు. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది..

ఎస్ఎస్ఎంబి 29 చిత్రంపై రాజమౌళి స్పందన..
ఇకపోతే ఇటీవల జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రత్యేక స్క్రీనింగ్ కోసం రాజమౌళి వెళ్ళగా అక్కడ తన తదుపరి సినిమా మహేష్ బాబు ప్రాజెక్టు పై స్పందిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు.. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని.. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.. అయితే క్యాస్టింగ్ సెలక్షన్ ఇంకా పూర్తి కాలేదని క్లారిటీ ఇచ్చిన రాజమౌళి ఇప్పుడు ఈ వార్త తెరపైకి రావడంతో ఇది నిజమే అని అభిమానులు కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

- Advertisement -

రూమర్స్ వైరల్..
ఇకపోతే ఈ సినిమా సెట్ పైకి వెళ్ళబోతుందని తెలిసినప్పటి నుంచి ఇందులో వారు నటిస్తారు.. వీరు నటిస్తారు అంటూ రకరకాల వార్తలు రోజుకొకటి చొప్పున సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే.. మరి ఇది కూడా అలానే అనుకోవాలా లేక సంప్రదించిన మాట వాస్తవమేనా అన్న విషయం త్వరలోనే తెలియనుంది ఇకపోతే మహేష్ బాబు సినిమాలో హృతిక్ రోషన్ నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు మరి వారి కోరికను రాజమౌళి నెరవేరుస్తారో లేదో చూడాలి..

హృతిక్ రోషన్ సినిమాలు..
ఇక ఇటీవలే ఫైటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇందులో ఫైటర్ జెట్ పైలెట్గా అదరగొట్టేశారు.. తన పాత్రకి ఎంతవరకు న్యాయం చేయాలో అంతకంటే ఎక్కువ న్యాయం చేసి ఈ సినిమా ద్వారా డీసెంట్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం జరిగింది. భారత వాయుసేన చేసిన మెరుపు దాడుల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు