Ram Charan : రామ్ చరణ్ రేర్ రికార్డ్.. ఊహించి ఉండరు..!

Ram Charan : రామ్ చరణ్.. తాజాగా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.. అయితే ఈ రికార్డు కేవలం నాలుగు రోజుల్లోనే సాధించడంతో అభిమానులు, సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇన్ స్టా గ్రామ్ లో రామ్ చరణ్ అరుదైన రికార్డు..

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియా ఫాలోవర్స్ కౌంట్ కూడా రోజురోజుకి రెట్టింపు అవుతుందని చెప్పవచ్చు.. టాలీవుడ్ లో ప్రస్తుతం రామ్ చరణ్ , అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ , మహేష్ బాబు, ప్రభాస్.. ఈ ఐదుగురు అత్యధిక ఫాలోవర్స్ ను కలిగివున్న స్టార్స్ గా, సోషల్ మీడియా స్టార్ట్గా పేరు దక్కించుకున్నారు.. ఇక మొన్న మార్చి 23 వరకు ఈ ఐదుగురు స్టార్స్ లో రామ్ చరణ్ మూడవ స్థానంలో నిలిచారు.. అయితే ఈ నాలుగు రోజుల్లోనే రామ్ చరణ్ తన ఫాలోయింగ్ నున్ఒక రేంజ్ లో పెంచుకున్నారు.. నాలుగు రోజుల క్రితం 21.1 మిలియన్ ఫాలోవర్స్ అంటే 2 కోట్ల 11 లక్షల మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈయన.. నాలుగు రోజుల్లోనే ఏకంగా అకౌంట్ 16 లక్షలకు చేరింది.. ఇక నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇన్స్టా అకౌంట్ ఫాలోవర్స్ సంఖ్య 21.7 మిలియన్ కి చేరుకోవడం గమనార్హం.. ఇక ఈ కౌంట్తో రాంచరణ్ రెండవ స్థానంలో ఉన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండను వెనక్కు నెట్టి ఆస్థానాన్ని దక్కించుకున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఇన్స్టా ఫాలోవర్స్ సంఖ్య మొన్న ఎలా ఉందో ఇప్పుడు కూడా 21.4 మిలియన్ కౌంట్ తో అలాగే ఉంది. ఇక మొదటి స్థానంలో 25.1 మిలియన్ ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉన్నారు అల్లు అర్జున్. ఇకపోతే బర్తడే రోజున రాంచరణ్ ఇంస్టాగ్రామ్ లో రెండవ స్థానాన్ని సొంతం చేసుకోవడంతో అభిమానులు తెగ సందడి చేస్తున్నారు ఈ స్పీడు చూస్తుంటే రామ్ చరణ్ రానున్న రోజుల్లో అల్లు అర్జున్ స్థానాన్ని కూడా ఆక్రమించేలా కనిపిస్తున్నారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం..

రామ్ చరణ్ సినిమాలు..

ప్రస్తుతం రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఆర్సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు.. ఇప్పటికే పూజా కార్యక్రమాలను లాంఛనంగా పూర్తి చేయడం జరిగింది. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో తన 17వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.. ఇక ఈ సినిమాపై కూడా రాజమౌళి అప్పుడే అంచనాలను పెంచిన విషయం తెలిసిందే.. మొత్తానికైతే రామ్ చరణ్ రేంజ్ ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకుపోతోందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు