Gopichand 32 : గోపీచంద్ మూవీకి క్రేజీ కాంబో .. రంగంలోకి బడా నిర్మాణ సంస్థలు..!

Gopichand 32 : మ్యాచో స్టార్ గోపీచంద్ , టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ 32 అనే వర్కింగ్ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా అప్డేట్ ని అందించారు మేకర్స్.. ప్రస్తుతం శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతోంది.. ఇందులో గోపీచంద్ ను సరికొత్త అవతార్ లో శ్రీను వైట్ల చూపించనున్నారని , సినీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇకపోతే ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ వేణు దోనేపూడి తన చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఇప్పుడు ఈ మూవీ కోసం టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ.. చిత్రాలయం స్టూడియోస్తో చేతులు కలిపింది.. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా మారారు.. అంతేకాదు ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై వేణు దోనేపూడి కామెంట్స్..

ఈ విషయాన్ని వేణు దోనేపూడి స్పష్టం చేస్తూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బ్యానర్ తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది.. సినిమా అవుట్ పుట్ బాగా వస్తోంది.. అత్యున్నత స్థాయి నిర్మాణం.. సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు.. ఇకపోతే ఈ సినిమా టాకీ షెడ్యూల్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాన తారాగణంతో కొన్ని కీలక సన్నివేశాలను సూట్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.. ఇక ఈ కొత్త షెడ్యూల్ తో టాకీ పార్ట్ మొత్తం పూర్తికానుంది.. గోపీచంద్, శ్రీనువైట్ల కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండడంతో అంచనాలు భారీ స్థాయికి చేరిపోయాయి..

గోపిచంద్ 32 మూవీ విశేషాలు..

పలు బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన గోపీ మోహన్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక కె.వి గుహన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తూ ఉండగా చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు. హీరోయిన్ తో పాటు ఇతర తారాగణం వివరాలను త్వరలోనే చిత్ర బృందం ప్రకటించనున్నట్లు సమాచారం.. ఇక భారీ బడ్జెట్తో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..

- Advertisement -

గోపీచంద్ కెరియర్..

గోపీచంద్ ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ గట్టి కం బ్యాక్ ఇవ్వలేకపోతున్నారు.. ఈ నేపథ్యంలోనే వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తున్నా కూడా సరైన సక్సెస్ రాలేదు. ఇక ఇటీవలే బీమా సినిమాతో వచ్చినా కూడా మెప్పించలేకపోయారు.. మార్చి ఎనిమిదో తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే త్వరలో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది… ఇక ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందివ్వలేదు కాబట్టే ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న తన 32వ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు గోపీచంద్. మరి ఈ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు