Bheema: ఈ సినిమా హిట్ అవడం శ్రీను వైట్లకి కూడా అవసరమే

1999లో రిలీజ్ అయిన నీకోసం అనే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీనువైట్ల. ఇప్పటివరకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన సినిమాలన్నిటిలో కూడా నీకోసమే సినిమా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న యూత్ అందరికీ శ్రీను వైట్ల అనగానే తను చేసిన కామెడీ ఫిలిమ్స్ అన్ని గుర్తొస్తాయి. చాలామంది ఇప్పుడు రిలీఫ్ అవ్వడానికి శ్రీను వైట్ల సినిమాల్లోని కామెడీ సీన్లని చూసి కూడా రిలాక్స్ అవుతారని కూడా చెప్పొచ్చు.

నీకోసం సినిమా తర్వాత చేసిన సినిమా ఆనందం. ఆ తర్వాత చేసిన సినిమా సొంతం. సొంతం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఆ సినిమా చూసిన ప్రతిసారి అందరూ కడుపుబ్బ నవ్వుతారు. ఆ సినిమాలో సునీల్ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చాలామంది మాట్లాడుకుంటారు. కంప్లీట్ సినిమా అంతా కూడా మంచి ఫన్ రైడ్ లా అనిపిస్తుంది. ఆ తర్వాత చేసిన వెంకీ సినిమా కూడా అదే రేంజ్ లో మంచి ఎంటర్టైన్మెంట్ లా అనిపిస్తుంది. అయితే వెంకీ సినిమా రీసెంట్ గా రీ రిలీజ్ అయినప్పుడు వచ్చిన రెస్పాన్స్ కూడా అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఇలా కామెడీ సినిమాలు చేస్తూనే చాలామంది అప్పటి స్టార్ హీరోలతో కూడా సినిమా చేశాడు శ్రీనువైట్ల. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం శ్రీనువైట్లకి దక్కిందని చెప్పొచ్చు. అలానే ఈ జనరేషన్ లో ఉన్న స్టార్ హీరోస్ అంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అని చెబుతారు. పవన్ కళ్యాణ్ తో ఈ ఇప్పటివరకు శ్రీను వైట్ల కి సినిమా కుదరలేదు. కానీ మహేష్ బాబుకి దూకుడు వంటి అద్భుతమైన హిట్ సినిమాను ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన ఆగడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

- Advertisement -

ఇకపోతే బాద్షా అనే సినిమా తర్వాత ఇప్పటివరకు శ్రీనువైట్ల కెరియర్ లో అదిరిపోయే హిట్ సినిమా అంటూ పడలేదు. శ్రీను వైట్ల నుంచి హిట్ సినిమా కోసం చాలామంది సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే వరుస డిజాస్టర్స్ తో ప్రస్తుతం శ్రీను వైట్ల తన కెరీర్ ని సాగిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం శ్రీను వైట్ల గోపీచంద్ తో విశ్వం అనే సినిమాను చేస్తున్నాడు.

గోపీచంద్ ప్రస్తుతం భీమా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా మార్చి 8న రిలీజ్ కాబోతుంది. లౌక్యం సినిమా తర్వాత గోపీచంద్ చేసిన సినిమాలన్నీ దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద కొద్దో గొప్ప ఆడాయి తప్ప బ్లాక్ బస్టర్ అంటూ ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు. అయితే ఇప్పుడు గోపీచంద్ చేస్తున్న ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమా పైన మంచి అంచనాలు పెంచుతుంది.

ఈ సినిమా రైట్స్ కూడా దాదాపు 12 కోట్ల వరకు చెల్లుబాటు అయినట్టు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అయితే నెక్స్ట్ గోపీచంద్ మార్కెట్ కూడా పెరుగుతుంది. అలానే గోపీచంద్ ఇప్పుడు శ్రీను వైట్లతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భీమా సినిమా హిట్ అయితే ఇటు గోపీచంద్ కి అటు శ్రీను వైట్లకి ఇద్దరికీ మంచి ప్లస్ అవుతుంది అని చెప్పొచ్చు. లేదంటే ఇద్దరు కొద్దిపాటి రిస్క్ లో పడినట్టే.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు