Dimple Hayati : వేణు స్వామి, డింపుల్ హయాతి ప్రత్యేక పూజలు… ఆల్కాహాల్ తోనా?

ఇటీవల కాలంలో వేణు స్వామి పేరు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన అసలు సినిమాలకు సంబంధించిన వ్యక్తి కాకపోయినప్పటికీ, సెలబ్రిటీల పేర్లతో ముడి పడుతూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సినీ సెలెబ్రెటీల జాతకాలు చెప్తూ పాపులర్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏ కపుల్ ఎప్పుడు విడిపోతారు? స్టార్స్ లైఫ్, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనే విషయాలను చెప్తూ కొన్నిసార్లు విమర్శలకు కూడా గురయ్యాడు. అయితే మరికొన్నిసార్లు ఆయన చెప్పిన జోస్యం నిజం కావడంతో కొంతమంది వేణు స్వామి జ్యోతిష్యాన్ని గట్టిగానే నమ్ముతున్నారు. అందులో భాగంగానే తరచుగా అతన్ని ఇంటికి పిలిపించుకొని మరీ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇప్పటిదాకా పలువురు సెలబ్రిటీలు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకోగా, తాజాగా హీరోయిన్ డింపుల్ హయాతి ఆల్ లిస్ట్ లో చేరిపోయింది. అయితే అలా పూజలు చేయించుకోవడం తప్పేమీ కాదు.. కానీ ఆ పూజలో ఆయన ఏకంగా ఆల్కాహాల్ ను పెట్టడం ఇప్పుడు చర్చకు దారి తీసింది.

సెలెబ్రిటీల లైఫ్ పై జోస్యం…
మొదట్లో వేణు స్వామి మాజీ స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య విడిపోతారు అని చెప్పి అక్కినేని అభిమానులకు షాక్ ఇచ్చారు. అయితే అప్పట్లో ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు వాళ్ళిద్దరి అభిమానులు. కానీ ఆశ్చర్యకరంగా ఆయన జోస్యం చెప్పిన తరువాత సామ్, నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. దీంతో వేణు స్వామి చెప్పిన జోస్యం నిజం అవుతుంది అన్ ప్రచారం గట్టిగానే జరిగింది. ఆ తర్వాత పలువురు ప్రముఖులు అనారోగ్యానికి గురవుతారు అని చెప్పి వేణు స్వామి వార్తల్లో నిలిచాడు. ప్రభాస్ గురించి ఆయన చేసిన కామెంట్స్ కూడా సంచలనం సృష్టించాయి. ఇక రీసెంట్ గా నయనతార, విగ్నేష్ శివన్ జంట విడాకుల బాట పట్టబోతోంది అని వార్తలు రావడంతో మరోసారి వేణు స్వామి జోస్యం చర్చకు వచ్చింది. ముందుగానే ఆయన నయనతారకు పెళ్లి తర్వాత సమస్యలు వస్తాయని, ఆమె సింగిల్ గానే ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఈ లవ్ బర్డ్స్ విడాకులు తీసుకుంటారా లేదా అనే విషయంపై కన్ఫ్యూజన్ నెలకొంది.

ఆల్కాహాల్ తో డింపుల్ హయతి ప్రత్యేక పూజలు…
ఇక వేణు స్వామిని గట్టిగా నమ్మిన సెలబ్రిటీలు కొందరు ఇప్పటికే ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అందులో నిధి అగర్వాల్, ఇనయా సుల్తానా, అశోక్ రెడ్డి వంటి వారు ఉన్నారు. తాజాగా సౌత్ హీరోయిన్ డింపుల్ హయాతి వేణు స్వామితో పూజలు చేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటోలపై నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. వేణు స్వామి డింపుల్ హయాతితో పూజలు చేయిస్తుండగా, పూజ మధ్యలో వైన్ బాటిల్ కనిపించడమే అందుకు కారణం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది.

- Advertisement -

తీర్థం బదులు మద్యం… ఇదే వేణు స్వామి స్పెషల్ పూజ..
కాగా వేణు స్వామి పూజలు నిజానికి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. పూజలో అందరూ సాధారణంగా తీర్థం ఉంచుతారు. కానీ ఆయన మాత్రం దాని బదులు మందును ఉంచుతాడు. కొంతకాలం క్రితం ఎవరు ఏది తాగితే దాన్నే పూజలో ఉంచుతానని స్వయంగా వేణు స్వామి చెప్పుకొచ్చాడు. ఇక తాను చేసే వామాచార పూజలు బాగాలమ్మకు, చిన్న మస్తా, తార, రాజశ్యామల… ఇలా ప్రతి ఒక్క పూజలో కూడా తను లిక్కర్ నే వాడతానని, అలాగే దాన్నే తీర్థంలో కలిపి ఇస్తానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి తాజాగా మరోసారి డింపుల్ హయతి పూజలో వైన్ బాటిల్ ఉండడం హాట్ టాపిక్ గా మారింది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు