Rajinikanth: రజినీకాంత్ అలా చేస్తారనుకోలేదు – లివింగ్ స్టన్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే యావత్ సినీ ప్రేక్షకులకు అభిమానమే..సూపర్ స్టార్ గా వెండితెరపై తిరుగులేని క్రేజ్ తో పాటు ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్న రజినీకాంత్ కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా భారీ స్థాయిలో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా వెండి తెరపై ఎంత విలాసవంతంగా కనిపించినా.. తన నిజ జీవితంలో మాత్రం నిరాడంబరంగా ఉంటారు. ముఖ్యంగా ఈయన చేసే సేవా కార్యక్రమాల గురించి కోలీవుడ్ నటీనటులు ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈయన త్వరలోనే పేదల కోసం ఏకంగా తన 12 ఎకరాలను ఉచితంగా ఇవ్వడమే కాదు ఆ ప్రాంతంలో హాస్పిటల్ కూడా కట్టించి పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించబోతున్నారు. ఇక హాస్పిటల్ తో పాటు ఉచితంగా పాఠశాలలు కూడా కట్టించబోతున్నట్లు సమాచారం.

రజనీకాంత్ చేసిన సహాయంపై నటుడు ఎమోషనల్..
ఇకపోతే తాజాగా రజనీకాంత్ చేసిన సహాయం గురించి ఒక నటుడు చెప్పి ఎమోషనల్ అయ్యారు.. ఆయన ఎవరో కాదు ప్రముఖ నటులు లివింగ్ స్టన్.. ఈయన కూడా ఒక యాక్టర్.. తన భార్యకు గుండెకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయవలసి వచ్చిందని అందుకోసం రజనీకాంత్ దాదాపుగా తనకు రూ .15 లక్షల రూపాయల డబ్బును ఇచ్చారని.. అయితే ఆ డబ్బులు తీసుకోవాలా వద్దా అని నాలో నేనే ఆలోచిస్తూ ఉంటే.. రజినీకాంత్ స్వయంగా నా వద్దకు వచ్చి..నేను నీ బ్రదర్ లాంటి వాడిని ..తీసుకో.. ఇంకా కావాలంటే చెప్పు అని అడిగారట రజనీకాంత్..

రజినీకాంత్ గురించీ లివింగ్ స్టన్ మాటల్లో..
లివింగ్ స్టన్ తెలియజేస్తూ బైబిల్ లో చెప్పినట్టుగానే కుడిచేత్తో చేసే సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదనే విషయాన్ని రజనీకాంత్ ఫాలో అవుతారేమో.. అలా చాలామందికి ఆయన అలాంటి సహాయం చేశారు అంటూ తెలియజేశారు లివింగ్ స్టన్.. సోషల్ మీడియాలో ఈయన మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతున్నాయి ఈ విషయం విన్న అభిమానులు సైతం దట్ ఇస్ తలైవా అందుకే సూపర్ స్టార్ అయ్యారు అంటూ తెలియజేస్తున్నారు.. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు. డబ్బు ఎంత ఉన్నా సరే సాదాసీదా మనిషి లాగానే జీవిస్తూ ఉంటారని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు..

- Advertisement -

రజినీకాంత్ సినిమాలు..
అయితే లివింగ్ స్టన్ చెప్పిన ఈ సంఘటన అంతా కూడా లాల్ సలాం సినిమా షూటింగ్లో జరిగినట్లు వెల్లడించారు.. రజనీకాంత్ చివరిగా జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.. ప్రస్తుతం వెట్టయాన్ అనే చిత్రానికి సంబంధించి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ లోకేష్ కనకరాజు తో ఒక చిత్రాన్ని.. జైలర్ సీక్వెల్ తర్వాత నటించబోతున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ పరంగా రజనీకాంత్ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేసినా.. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో వాటి నుంచి విరమించుకున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు