Vijay Devarakonda : ఈసారి రెమ్యూనరేషన్ పూర్తిగా అందుతుందా.?

Vijay Devarakonda : ఎప్పటినుంచో ప్రయత్నాలు చేసినా కూడా అతి తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపు సాధించుకున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి జీవితాన్ని ఒక శుక్రవారం మారుస్తుంది అని చెబుతారు. అలా విజయ్ దేవరకొండ కి 2017 ఆగస్టు 25 అలా కలిసి వచ్చింది. అర్జున్ రెడ్డి అని ఒక సినిమా వచ్చి విజయ్ దేవరకొండ ఫేట్ మార్చేసింది అని చెప్పొచ్చు.
ఆ సినిమాతో వరుస అవకాశాలు విజయ్ దేవరకొండ కి వచ్చాయి.

అయితే కొన్ని ప్రాజెక్టులను ఎంతో నమ్మకం పెట్టి కొందరు హీరోలు దర్శకులు నమ్మి ఒప్పుకుంటారు. అయితే ఏ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మారాయి. మామూలు అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించాయి.
ఇకపోతే ఒక దర్శకుడు సినిమాను చేయటం అనేది మాత్రమే అతడి చేతిలో ఉంటుంది కానీ ఆ తర్వాత ఫలితం అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు.

ఇకపోతే కొన్ని సినిమాలను చూసినప్పుడు ఈ హీరో ఈ దర్శకుడితో పని చేస్తే బాగుంటుంది అని కొంతమందికి అనిపిస్తుంది. అలా అర్జున్ రెడ్డి సినిమా చూసినప్పుడు పూరీ జగన్నాథ్ లాంటి దర్శకుడు చేతిలో విజయ్ దేవరకొండ పడితే ఆ సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది అంటూ అప్పట్లో చాలామంది చెప్పుకొచ్చారు. కొన్ని సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వేశారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది అయితే ఆ సినిమా ఫలితం గురించి ప్రేక్షకులకు తెలిసిందే.

- Advertisement -

ఆ సినిమా విషయంలో విజయ్ చాలా నమ్మకంతో పనిచేశాడు. ఇప్పటివరకు కూడా విజయ్ లైగర్ సినిమాను కూడా చూడలేదు. ఈ సినిమా జరుగుతుండగానే పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమా కూడా విజయ్ తో శ్రీకారం చుట్టాడు. ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ఇకపోతే లైగర్ సినిమాకు సంబంధించి విజయ్ పూర్తిగా రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు.

పూరి కనెక్ట్స్ నిర్మించిన ఈ సినిమాకి సంబంధించి విజయ్ కి 20 కోట్లు ఇస్తామని ఒప్పుకున్నారు. మొదటగా తొమ్మిది కోట్లను విజయకు అందించారు. ఆ తర్వాత ఒక మూడు కోట్లు వరకు ఇచ్చారు. అయితే ఈ సినిమా ఫలితం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి పూర్తి రెమ్యూనరేషన్ అందుకోలేదు విజయ్. అలానే లైగర్ సినిమాతో చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోయారు. ఆ మధ్యకాలంలో వాళ్లు ధర్నాలు కూడా చేస్తామంటూ రంగంలోకి దిగారు. అయితే వీరిని ఉద్దేశించి పూరీ జగన్నాథ్ మాట్లాడిన ఆడియో కూడా అప్పట్లో లీకై కొద్దిపాటి సంచలనానికి తెరతీసింది.

ఇకపోతే విజయ్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను చేస్తున్నాడు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో గీత గోవిందం అని బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. ఈ సినిమా దాదాపు 100 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి పూర్తి రెమ్యూనరేషన్ విజయ్ అందుకుని చాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు