Puri Jagannath : ఎన్నో లోతులు చూశాడు కానీ ఇది పాతాళం

Puri Jagannath : పూరి జగన్నాథ్ గన్ నుంచి బుల్లెట్లు బయటకు వచ్చినట్టు ఈయన పెన్ నుంచి డైలాగులు బయటకు వస్తాయి. అతి తక్కువ టైంలో స్క్రిప్ట్ పూర్తి చేసి త్వరగా షూటింగ్ కూడా చేసేసి రిలీజ్ చేయడం పూరికి ఎప్పటినుంచో వస్తున్న అలవాటు. సినిమాను మొదలు పెట్టినప్పుడు పూరీ జగన్నాథ్ ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాడు. దాదాపుల అనౌన్స్ చేసిన సినిమాలన్నీ కూడా కరెక్ట్ టైం కి రిలీజ్ అయ్యాయి. ఇక రీసెంట్ గా పూరీ పరిస్థితి కంప్లీట్ గా మారిపోయింది.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న పర్ఫెక్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ అంటే ఒకప్పుడు పూరి జగన్నా పేరు వినిపించేది. ఇప్పుడున్న చాలామంది దర్శకులు కూడా పూరి జగన్నాథ్ ఒకరకంగా ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పొచ్చు. దర్శక ధీరుడు జక్కన్న కూడా
ఒక సందర్భంలో మేము సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి ఒక సినిమాను చేస్తే, కేవలం ఆయన ఒక డైలాగ్ తో అందర్నీ కట్టిపడేస్తాడు అంటూ బిజినెస్మెన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కూడా చెప్పుకొచ్చాడు.

ఇకపోతే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పూరి జగన్నాథ్ కి అతిపెద్ద అభిమాని అని కూడా చెప్పుకుంటూ వస్తారు. విలన్లకు కోపం చాలా ఈజీగా తెప్పిస్తారని కేవలం ఒక డైలాగ్ తో విలన్ కి కోపం తెప్పిస్తాడని చెబుతూ, అందుకే పూరి జగన్నాథ్ (Puri Jagannath)అంటే తనకి అసూయని అంటూ ఉంటారు. ఇప్పుడు పాన్ ఇండియా దర్శకుల్లో ఒకరైన సుకుమార్ కూడా ఒకప్పుడు పూరీ జగన్నాథ్ దగ్గర పని చేయాలని ప్రయత్నాలు చేసారు

- Advertisement -

అయితే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎత్తు పల్లాలు ఉన్నట్లే పూరి జగన్నాథ్ జీవితంలో కూడా చాలా ఎత్తు పల్లాలు ఉన్నాయి. అయితే పూరి చూసిన లోతు మామూలుది కాదు దాదాపు కెరియర్ ఫినిష్ అయిపోయింది అనుకున్న టైంలో మళ్లీ అద్భుతమైన కం బ్యాక్ ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్తే ఎలాగోలా బయటపడగలం. కానీ ప్రతిసారి లోపలికి వెళ్తే బయటపడడానికి మనకున్న శక్తి కూడా సరిపోదు. ఒక తప్పుతో మనం పాతాళానికి వెళ్ళిపోయినప్పుడు, మరోసారి ఆ తప్పు చేయకుండా ఉండే ప్రయత్నం చేస్తుంటాం.

కానీ పూరి జగన్నాథ్ మాత్రం అలా కాదు దాదాపు టెంపర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ కెరియర్లు ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ సినిమా అంటూ లేదు. రామ్ పోతినేని హీరోగా చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి హిట్ అయింది. ఆ సినిమాకి మంచి డబ్బులు కూడా వచ్చాయి. కానీ తర్వాత అదే ప్రొడక్షన్స్ లో వచ్చిన రొమాంటిక్ సినిమా లైగర్ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయాయి.

ఇక పూరి లైగర్ సినిమాకు సంబంధించి పూరి మామూలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఇంటి దగ్గరికి వచ్చి ధర్నాలు కూడా చేసే పరిస్థితి వరకు వచ్చింది. అయితే వీళ్ళ గురించి పూరి కూడా రియాక్ట్ అయ్యాడు. ఆ ఆడియో అప్పట్లో
సోషల్ మీడియాలో కూడా లీక్ అయింది. ఇకపోతే ప్రస్తుతం డబల్ ఇస్మార్ట్ అనే సినిమాను చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ బడ్జెట్ ప్రాబ్లమ్స్ వలన హోల్డ్ లో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓల్డ్ పిక్స్ పెట్టి… షూటింగ్ జరుగుతుంది అన్నట్టు కవర్ చేస్తున్నారు.

వాస్తవానికి డబుల్ ఇస్మార్ట్ సినిమా ఫిబ్రవరి 08నే రిలీజ్ అవ్వాల్సింది. కానీ, షూటింగ్ అవ్వకపోవడం వల్లే వాయిదా.
ఈ సినిమాకి బిజినెస్ కూడా సరిగ్గా అవ్వడం లేదు. థియేటర్ రైట్స్ తోనే ఎక్కువ రికవరీ చేయాలని చూస్తున్నారు. కానీ, పూరి పై లైగర్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. పైగా ఇస్మార్ట్ శంకర్ తప్పా.. ఈమధ్య ఆయనకు ఒక్క మంచి హిట్ కూడా లేదు. భయ్యర్లతో పూరికి ఇప్పటికే కొన్ని వివాదాలు ఉన్నాయి. వీటన్నింటి వలన డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ రైట్స్ కొనడానికి బయ్యర్లు భయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు