Liger : అప్పుడు 200 కోట్లు నుంచి మొదలు పెడతామన్నారు ఇప్పుడు ఇద్దరూ రిస్క్ లో ఉన్నారు

Liger : ఒక దర్శకుడి ఆలోచనలు నమ్మి కోట్లు పెట్టి సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. ఆ ఐడియా వర్కౌట్ అయి ఆ సినిమాకు కోట్లు వస్తే అది సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది అదే కోట్లు నష్టపోతే రిస్క్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇలాంటి రిస్క్ ప్రాజెక్టులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. ఒక సినిమా హిట్ అయితే వెతుక్కుంటూ అవకాశాలు ఎలా వస్తాయో, ఒక సినిమా ప్లాప్ అయితే వచ్చిన అవకాశాలు కూడా అలానే వెను తిరుగుతాయి.

విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా లైగర్ ( Liger ). ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాదాపు ఈ సినిమా కోసం కొన్ని కోట్లు ఖర్చుపెట్టి నిర్మించారు పూరి కనెక్ట్స్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటేనే చాలామంది మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇది పాన్ ఇండియా రేంజ్ లో వస్తుంది అనగానే ఆ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ను ఈ సినిమా మినిమం అందుకోలేకపోయింది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక కరీంనగర్ నుంచి వచ్చిన ఒక కుర్రోడు ఒక ఫైటర్ గా ఎలా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. అయితే ఇది వినడానికి మామూలు స్టోరీలైన అనిపించినా కూడా పూరి దీనిని ఎంత బాగా డీల్ చేశాడో అంటూ చాలామంది అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇదే కాన్సెప్ట్ లో అమ్మానాన్న తమిళ అమ్మాయి అనే ఒక సినిమాను కూడా తెరకెక్కించాడు పూరి జగన్నాథ్. ఆ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ కెరియర్ లో ఉన్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఆ సినిమా కూడా ఒకటి.

- Advertisement -

అయితే ఆ స్థాయి ను మించి ఈ సినిమా ఉంటుందని అనుకున్నారు. దానికి తోడు మైక్ టైసన్ లాంటి రియల్ బాక్సర్ కూడా ఈ సినిమాలో నటించారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఒక నత్తి క్యారెక్టర్ తో కనిపిస్తాడు. ఈ క్యారెక్టర్ అసలు విజయ్ కి సెట్ కాలేదు. మొత్తానికి ఎంతో నమ్మి ఈ ప్రాజెక్టు కోసం పని చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ సినిమా కలెక్షన్స్ ను నేను 200 కోట్లు నుంచి స్టార్ట్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. టీం కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉంది. కానీ ఫలితం తారుమారు అయిపోయింది.

అయితే ఈ ఒక్క ప్రాజెక్టు తో ఇప్పుడు ఇద్దరి లైఫ్ లు కూడా రిస్క్ లో పడిపోయాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్ ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే దాదాపు 90 కోట్ల వరకు చేరుకుంది. ఈ సినిమా ఓటిటి రైట్స్ 50 కోట్ల వరకు వస్తుంది అని అనుకుంటున్నారు కానీ అది సాధ్యపడదు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు అని చెప్పొచ్చు. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే ఇక పూరి జగన్నాధ్ చేస్తున్న సినిమా డబల్ ఇష్మార్ట్. ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా పైన కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి బడ్జెట్ ఇష్యూస్ ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాను కొనడానికి బయర్లు కూడా భయపడుతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఒక సినిమా ఫలితం అనేది రెండు ప్రాజెక్టుల పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లైగర్ సినిమా అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు