Karthika deepam 2 : మోనిత పాత్రలో ఎవరీమే..?

Karthika deepam 2 : తెలుగు బుల్లితెర పై సూపర్ హిట్ సీరియల్ గా కొనసాగిన కార్తీకదీపం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే .. టీవీ టీఆర్పీ రేటింగ్స్ లో సరికొత్త రికార్డులు సెట్ చేసింది ఈ సీరియల్.. ఈ సీరియల్ కి సీజన్ 2 కూడా తీసుకొస్తున్న విషయం తెలిసిందే.. అయితే కార్తీకదీపం నవ వసంతం పేరిట ఈ సీరియల్ సీజన్ 2 నేటి నుంచి టెలికాస్ట్ కాబోతోంది.. స్టార్ మా ఛానల్లో నేడు మార్చి 25 నుంచి సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ కాబోతోంది. ఇప్పటికే కార్తీకదీపం ( Karthika deepam 2 )నవ వసంతం సీరియల్ నుంచి పలు ప్రోమోలు రిలీజ్ అయ్యి వైరల్ అవుతున్నాయి.. ఈ సీజన్లో మెయిన్ లీడ్స్ వంటలక్క డాక్టర్ బాబు పాత్రలలో ఎప్పటిలాగే నిరూపమ్ పరిటాల, ప్రేమీ విశ్వనాధ్ చేస్తున్నారు.. అయితే మిగతా పాత్రలు మాత్రం మార్చేసినట్లు తెలుస్తోంది..

కార్తీక దీపం లో కొత్త నటి..

ఇకపోతే కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు , వంటలక్క పాత్రలతో పాటు అంతే పాపులారిటీ దక్కించుకుంది మోనిత పాత్ర.. గత సీజన్లో మౌనిత పాత్రలో కన్నడ బ్యూటీ శోభా శెట్టి నటించగా.. ఇప్పుడు ఆ పాత్రలోకి ఒక కొత్త నటిని తీసికొచ్చినట్లు తెలుస్తోంది. కార్తీకదీపం సీరియల్ లో ఫీమేల్ సెకండ్ లీడ్ గా నటి యాంకర్ గాయత్రీ సింహాద్రిని తీసుకున్నట్లు తెలుస్తోంది.. డాక్టర్ బాబు ఇంట్లో ఉండే అమ్మాయి పాత్రలాగే ఉంది మోనిత పాత్ర లాగే ఈ పాత్ర కూడా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంకా డాక్టర్ బాబును ప్రేమించే పాత్రలోనే గాయత్రి సింహాద్రి నటిస్తున్నట్టు తెలుస్తోంది.. దీంతో ఈమె ఎవరు అని తెలుసుకోవడానికి కూడా అభిమానులు ఆరాధిస్తున్నారు..

గాయత్రీ సింహాద్రి కెరియర్..

గాయత్రి సింహాద్రి విషయానికి వస్తే.. త్రినయని సీరియల్స్ తో పాటు జోష్ షోలో యాంకర్ గా పనిచేసిన ఈమె పలు టీవీ షోలలో కూడా కనిపించింది.. ఇప్పుడు ఏకంగా కార్తీకదీపం సీజన్ 2 లో ముఖ్య పాత్రలో అవకాశాన్ని కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.. మరి ఈ సీరియల్ లో గాయత్రీ సింహాద్రి మోనిత రేంజ్ లో మెప్పిస్తుందో లేక అంతకంటే ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంటుందో చూడాలి.. ఇక కార్తీకదీపం అభిమానులు నేటి నుంచి సీరియల్ చూడడానికి సిద్ధం అయిపోతున్నారని చెప్పవచ్చు.

- Advertisement -

శోభా శెట్టి..

ఇకపోతే కార్తీకదీపం సీరియల్ లో శోభా శెట్టి మోనిత పాత్రలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిందని చెప్పాలి. అయితే బిగ్ బాస్ సీజన్ 7 లోకి వచ్చిన తర్వాత నెగెటివిటీని మూట కట్టుకున్న నేపథ్యంలోనే తనకు ఈ సీరియల్ లో అవకాశం రాలేదని పరోక్షంగా వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ.. మొత్తానికైతే ఈ పాత్రను మిస్ చేసుకున్న శోభా శెట్టి బిజినెస్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు