Shobha Shetty: బిగ్ బాస్ వల్లే గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యా.. శోభ ఎమోషనల్ కామెంట్స్..!

మోనిత అలియాస్ శోభా శెట్టి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఏకైక సీరియల్ కార్తీకదీపం.. ఇందులో మోనితగా విలన్ పాత్రలో అలరించి..ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది శోభా శెట్టి.. ఈ క్రేజ్ తోనే ఆమె బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.. అయితే అక్కడ తన ప్రవర్తన తన కెరియర్ కు నెగిటివ్ గా మారిందని అర్థమవుతుంది.. ఇకపోతే ఈ షో వల్ల శోభ శెట్టి కి మంచి కంటే చెడే ఎక్కువ జరిగినట్లు అనిపిస్తోంది.. గోల్డెన్ ఛాన్స్ ని మిస్ అయినట్లుగా స్వయంగా చెబుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది..

కార్తీకదీపం 2 లో నో ఛాన్స్..
ఇకపోతే కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.. అయితే ఈ సీరియల్ ముగియడంతో మళ్లీ సీక్వెల్ మొదలు పెట్టాలని అభిమానులు ఎంతగానో కామెంట్లు చేశారు.. ఈ నేపథ్యంలోనే త్వరలోనే కార్తీకదీపం 2 రాబోతోంది అంటూ ఒక ప్రోమోని కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే..అయితే ఇందులో శోభ శెట్టికి అవకాశం ఇవ్వలేదు అన్నట్లుగా తెలుస్తోంది..

ఛాన్స్ ఇవ్వకపోవడంపై శోభా శెట్టి క్లారిటీ ..

- Advertisement -

ఇకపోతే కార్తీకదీపం 2 లో తనకు అవకాశం రాలేదంటూ స్వయంగా శోభ శెట్టి చెప్పుకొచ్చింది.. కార్తీకదీపం 2 లో నాకు ఆఫర్ దక్కలేదు.. బిగ్ బాస్ హౌస్ లో నన్ను విలన్ గా చూశారు. కార్తీకదీపం లో నన్ను మోనితగా ఎలా చూశారో.. హౌస్ లో కూడా అలానే చూసారు.. కార్తీకదీపం 2 ప్రోమో చాలా బాగుంది.. అయితే ఈ సీరియల్ లో నేను నటించడం లేదు.. నేను నటించాలని ఎవరు నన్ను సంప్రదించలేదు .. కాబట్టి నాకు ఇందులో ఛాన్స్ దక్కలేదు అంటూ శోభ శెట్టి తెలిపింది.. అంతే కాదు పరోక్షంగా బిగ్బాస్ షో తన ఇమేజ్ ని దెబ్బతీసిందని.. అందుకే ఆఫర్ దక్కలేదు అనే అర్థంలో మాట్లాడింది ఈ ముద్దుగుమ్మ..

శోభ శెట్టి బిగ్ బాస్ ప్రయాణం..

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె తన ప్రవర్తనతో హౌస్ లో వివాదాస్పదంగా మారింది. శోభా శెట్టి తల బిరుసు సమాధానాలు ఇతర కంటెస్టెంట్స్ ని చులకనగా చూడడం జనాలకు నచ్చలేదు.. ఒక దశలో పెద్ద ఎత్తున ఈమెను ఎలిమినేట్ చేయాలని డిమాండ్ కూడా వినిపించింది.. అంతేకాదు స్టార్ మా యాజమాన్యం ఈమెను కాపాడుతూ వచ్చిందనే విమర్శలు కూడా వినిపించాయి.. ఇక ఫైనల్ గా 14వ వారం ఎలిమినేట్ అయ్యింది.. ఈమె బయటకి వచ్చిన తర్వాత జనాలు ట్రోల్ చేశారు.. దీంతో తనపై షో ఎంత నెగిటివిటీ తెచ్చిపెట్టిందో ఆమె స్వయంగా తెలుసుకుని.. పలు సార్లు క్షమాపణలు కూడా చెప్పింది.. అయినా ఈయనపై నెగెటివిటీ తగ్గకపోగా.. ఇప్పుడు గోల్డెన్ అవకాశాన్ని కూడా మిస్ చేసుకుని బాధపడుతోంది శోభా శెట్టి..

శోభ శెట్టి కెరియర్..
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యాపారాల మీద దృష్టి పెట్టింది. మేకప్ స్టూడియో పెట్టిన ఈమె త్వరలో చీరల వ్యాపారం కూడా మొదలుపెట్టబోతోంది. అలాగే కాఫీ విత్ శోభ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు