Suriya Movie: సూర్య S/O కృష్ణన్ ఈ స్టార్ జీవిత కథ… సంచలన నిజాలు చెప్పిన గౌతమ్ మీనన్

ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసిన సినిమా వారణం ఆయిరమ్. ఇలా అంటే మన తెలుగు ఆడియన్స్‌కు తెలియకపోవచ్చు. కానీ, సూర్య S/O కృష్ణన్ అంటే అందరికీ తెలుసు. సూర్య ద్వీపాత్రాభినయం చేసిన ఈ చిత్రం తమిళంలో వారణం ఆయిరమ్ పేరుతో రిలీజ్ అయింది. అక్కడ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా డైరెక్టర్ గౌతమ్ వాస్ దేవ్ మీనన్ తెలుగులో కూడా రిలీజ్ చేశాడు. తెలుగులో సూర్య S/O కృష్ణన్ అనే టైటిల్‌తో ఈ మూవీ వచ్చింది. అనుకున్నట్టే ఈ సూర్య S/O కృష్ణన్ అప్పట్లో పెద్ద హిట్ సాధించింది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ కూడా ఈ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల ఈ చిత్రం రీ రిలీజ్ అయింది. అప్పుడు కూడా సూర్య S/O కృష్ణన్ కు చూడటానికి ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్స్ కు వచ్చారు. భారతీయ ఆర్మీ అధికారి సూర్య ఓ రెస్క్యూ మిషన్ లో ఉన్న సమయంలో తన తండ్రి కృష్ణన్ మరణ వార్త తెలుస్తుంది. అప్పుడు సూర్య ఏం చేశాడు అనేది సూర్య S/O కృష్ణన్ మూవీ. అయితే ఈ సినిమా ఓ స్టార్ నటుడి జీవితంలో జరిగిన కథ అంట. ఈ విషయాన్ని డైరెక్టర్ గౌతమ్ మీనన్ చెప్పారు.

సూర్య S/O కృష్ణన్ నిజమైన కథ…

సూర్య S/O కృష్ణన్ సినిమాను తన నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తీసినట్టు స్వయంగా గౌతమ్ మీనన్ వెల్లడించారు. తన జీవితంలో ఎక్కువ అభిమానించే తన తండ్రి మరణం తర్వాత తాను ఫేస్ చేసిన దాన్నే సినిమాలో చూపించారట. అందుకు అనుకూలంగానే గౌతమ్ మీనన్ స్క్రిన్ ప్లే రాశాడట. తన తండ్రి 2007లో మరణ వార్త విన్న తర్వాత తన జీవితం ఎలా సాగిందో, అనే దాన్ని ప్రేరణగా తీసుకుని సీన్స్ రాశానని ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి ఎమోషనల్ సీన్స్ లో సూర్య బాగా నటించాడని, అలాగే హారిస్ జయరాజ్ కూడా అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారని అన్నారు. అందుకే ఈ సినిమా తమిళంలో, తెలుగులో భారీ విజయం సాధించిందని చెప్పారు.

- Advertisement -

సినిమాలో మోహన్ లాల్, నానా పటేకర్…

వారణం ఆయిరమ్ స్టోరీ పూర్తి అయిన తర్వాత సూర్యతో రెండు పాత్రలు చేయించడం ఇష్టం లేదట. తండ్రి పాత్రలో ఓ స్టార్ నటుడిని తీసుకోవాలని గౌతమ్ మీనన్ అనుకున్నారట. అలా కృష్ణన్ పాత్ర కోసం ముందుగా మోహన్ లాల్ పేరును పరిశీలించారట. మోహన్ లాల్ కుదరదు అంటే.. నానా పటేకర్ ను ఫైనల్ చేద్ధామని ప్లాన్ చేశారట. కానీ, చివరికి ఇష్టం లేకున్నా… సూర్యతోనే డ్యూయల్ రోల్ చేయించారట.

దీపికా పదుకుణె మిస్ అయింది…

అలాగే ఈ వారణం ఆయిరమ్ (సూర్య S/O కృష్ణన్) సినిమాలో మరో కీలక పాత్ర మేఘన. ఈ పాత్రలో సమీరా రెడ్డి నటించింది. అయితే ముందుగా ఈ మేఘన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్, పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకుణెను తీసుకోవాలని గౌతమ్ మీనన్ అనుకున్నారట. దీపికాతో చర్చలు కూడా జరిపారట. కానీ, అదే టైంలో దీపికా పదుకుణె… ఓం శాంతి ఓమ్ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చి ఉందట. దీంతో పాటు మరో ప్రాజెక్ట్ కూడా చేతిలో ఉండటంతో డేట్స్ క్లాష్ అయ్యే ఛాన్స్ ఉందని, ఫైనల్ గా సమీరా రెడ్డిని మేఘన పాత్రకు తీసుకున్నట్టు ఆయన చెప్పారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు