Manchu Vishnu : తండ్రికి తెలియకుండా చిరుతో అలాంటి పని చేస్తున్న మంచు విష్ణు..!

Manchu Vishnu : గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి , కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య గ్యాప్ ఉందని అందరూ అంటూ ఉంటారు.. కానీ తండ్రి మోహన్ బాబుకు తెలియకుండా చిరంజీవితో మంచు విష్ణు ఆ పని చేస్తున్నారని.. ఇప్పుడు ఓ కొత్త వార్త తెరపైకి వచ్చింది.. అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

అప్పటి నుంచే విభేదాలు..

రెండేళ్ల క్రితం ‘ మా ‘ ఎన్నికల సందర్భంలో చోటు చేసుకున్న పరిణామాలే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.. ఆ సమయంలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కూడా విమర్శలు చేసుకున్నారు.. ఇద్దరికీ ఇద్దరూ కూడా చురకలు అంటించుకున్నారు.. ఈ విషయంలో చిరంజీవి పై మంచు విష్ణు (Manchu Vishnu) కూడా ఫైర్ అయ్యారు.. పేరు చెప్పలేదు కానీ చిరంజీవిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు.. దీనితో అప్పట్లో వీరి మధ్య మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. ఇలా అంతకుముందు కూడా పలు సందర్భాలలో విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

మోహన్ బాబు కి తెలియకుండా చిరంజీవి తో ఆ పని..

ఇకపోతే చిరంజీవి , మోహన్ బాబు మధ్య ఏం లేవని చెప్పే ప్రయత్నం మంచు విష్ణు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు..అంతేకాదు ఏదైనా అకేషనల్ గా కలుసుకున్నప్పుడు తాము మంచి స్నేహితులమే అనే లాగా వీరిద్దరూ ప్రవర్తిస్తారు కూడా.. అయితే ఈ ఇద్దరి మధ్య రిలేషన్ విషయంలో మంచు విష్ణు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని తెలుస్తోంది.. ఈ విషయాన్ని తాజాగా మంచు విష్ణు వెల్లడించారు..మోహన్ బాబుకి తెలియకుండా మంచు విష్ణు అలాంటి పనులు చేస్తున్నారట. మోహన్ బాబు, చిరంజీవి మధ్య ఫోన్ సందేశాల రహస్యాన్ని కూడా వెల్లడించారు..

- Advertisement -

అసలు మేటర్ లీక్ చేసారు గా..

మా నాన్నకి మెసేజ్లు పెట్టడం తెలియదు… వచ్చిన వాటిని చూసుకుంటాడు అంతే.. ఇప్పుడిప్పుడే వాయిస్ మెసేజ్ లు పంపిస్తున్నాడు.. కానీ నేను చనువు తీసుకొని.. నాన్న ఫోన్ నుంచి చిరంజీవి అంకుల్ కి మెసేజ్లు పంపిస్తుంటాను.. దానికి ఆయన నుంచి ప్రాపర్ గా రిప్లై ఉంటుంది.. రిలేషన్ షిప్ ను బిల్డప్ చేసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను అంటూ తెలిపారు మంచు విష్ణు..

చిరంజీవి కాంప్లిమెంట్స్ ఆనందాన్ని ఇచ్చాయి..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు మాట్లాడుతూ.. చిరంజీవితో అనుబంధం అలాగే ఆయన తనపై చూపే ప్రేమను కూడా మంచు విష్ణు వెల్లడించారు.. ఇప్పటివరకు నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది చిరంజీవి మాత్రమే.. నటుడుగా నేను నెక్స్ట్ లెవెల్ వెళ్లే ప్లాన్ చేస్తున్నాను.. మునుముందు పాన్ ఇండియా దాటి వెళ్లాలి అనుకుంటున్నాను అంటూ తెలిపారు.. అందుకు మోసగాళ్లు సినిమా పునాది అవుతుంది. కెరీర్ లో బెస్ట్ కాంప్లిమెంట్ గురించి చిరంజీవి ఇచ్చిన కాంప్లిమెంట్ తో కడుపు నిండిపోయింది..

ఒకసారి కృష్ణంరాజు బర్తడే సందర్భంగా అందరూ ఆయన వద్దకు వెళ్తే.. చిరంజీవి కూడా అక్కడికి వచ్చారు.. పెద్దవాళ్లంతా ఒకచోట కూర్చున్నారు.. వారి వద్దకు చిరంజీవి వెళుతున్న సమయంలో నేను విష్ చేశాను.. సడన్గా నన్ను చూసిన చిరంజీవి.. హే.. పేపర్లో నీ ఫోటో చూశాను.. చాలా బాగున్నావ్.. నాకు బాలీవుడ్ హీరోలా అనిపించావు.. ఏంటి ఈ హీరో మన తెలుగు పేపర్ లో ఉన్నాడేంటి అనుకున్నాను.. అంత బాగున్నావు అని చిరంజీవి ప్రశంసించారు.. ఆ కాంప్లిమెంటు ఇప్పటికీ మర్చిపోలేను అని తెలిపారు.. ఎందుకంటే ఆ హీరో తన ఫేవరెట్ యాక్టర్ అని.. చిన్నప్పటి నుంచి ఆయనను ఆరాధించే వాడిని అని.. ఆయనలా అవ్వాలని కలలుకనే వాడిని.. సరిగా మెగాస్టార్ ఆయనతోనే పోల్చడంతో ఆనందానికి అవధులు లేవు అని తెలిపారు మంచు విష్ణు.. ఇక ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అని కూడా తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు