Family Star : అన్ని కోట్లు రికవరీ అవుతాయా.?

Family Star : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు అయితే కొంతమంది హీరోలకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. మరి కొంతమంది హీరోలు స్వయంగా తమకు తాము మంచి బ్యాక్ గ్రౌండ్ సాధించుకున్నారు. తెలుగు సినిమా ఫిలిం ఇండస్ట్రీలో నిలబెట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఎంతోమంది ఎన్నో కలలతో వచ్చి వెనుతిరిగిపోయిన హీరోలు ఉన్నారు. నటులు కూడా ఉన్నారు. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు ప్రతి ఒక్కరికి కొంత టైం అంటూ నడుస్తుంది.

కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో ఆఫీసులు చుట్టూ కాళ్లు అరిగిపోయేలా తిరిగి చిన్న చిన్న సినిమాల్లో వేషాలు సాధించి ఆ తర్వాత చిన్నగా గుర్తింపు సాధించుకున్నాడు విజయ్ దేవరకొండ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమాలో రిషి క్యారెక్టర్ చాలామందికి బాగా కనెక్ట్ అయింది. రిషి క్యారెక్టర్ లో వేరియేషన్స్ ఆ క్యారెక్టర్ ని విజయ్ ప్లే చేసిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది.

ఆ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకుడుగా పరిచయమైన పెళ్లిచూపులు సినిమాతో హీరోగా అవకాశాన్ని పొందుకున్నాడు. ఈ సినిమాతో అద్భుతమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఒక చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా పెద్ద విజయాన్ని పొందుకుంది. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా అప్పట్లో శివ సినిమా సృష్టించిన అంతటి సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత విజయ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

- Advertisement -

నటుడుగా విజయ్ చాలా కష్టపడినా కూడా కొన్ని ప్రాజెక్టులు విజయ్ మార్కెట్ ను దెబ్బతీసాయని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి సినిమా చూసినప్పుడు చాలామంది ఇది ఒక పూరి జగన్నాథ్ కైండ్ ఆఫ్ ఫిలిం లా ఉంది అని అనుకున్నారు. ఇటువంటి హీరో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తే ఆ అవుట్ పుట్ ఇంకా బాగుంటుంది. అని కూడా చాలామంది అప్పట్లో మాట్లాడుకున్నారు. అయితే ఎట్టకేలకు వీరిద్దరి కాంబినేషన్ కూడా సెట్ అయింది. వీరిద్దరూ కలిసి లైగర్ అనే ఒక పాన్ ఇండియా సినిమాను చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రమైన డిజాస్టర్ ఎదుర్కొంది.

ఎన్నో అంచనాలతో ఈ సినిమాకు వెళ్ళిన ఆడియన్స్ అందరికీ ఈ సినిమా ఒక చేదు జ్ఞాపకం. ఈ సినిమా ట్రైలర్ తోనే చాలామందికి అర్థం అయిపోయింది. కానీ సినిమాలో ఏదో ఉండబోతుందని నమ్మకంతో వెళ్లారు. కానీ సినిమాలో కూడా ఏమీ లేదు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాని నేను 200 కోట్లు కలెక్షన్స్ నుంచి లెక్క పెడతానని కూడా విజయ్ అప్పట్లో చెప్పుకోచ్చాడు. ఆ తర్వాత ట్రోల్ కూడా గురయ్యాడు విజయ్.

ఇక విజయ్ చేసిన చివరి సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం విజయ్ సినిమా కొనడానికి బయ్యర్లు భయపడుతున్నారని ఫిలిం నగర్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమా బడ్జెట్ దాదాపు 90 కోట్లు వరకు చేరుకుంది. థియేట్రికల్ రైట్స్ 55 – 60 కోట్లు వరకు అంచనా వేస్తున్నారు. కానీ, అవ్వడం లేదు. ఇకపోతే విజయ్ నటించిన ఖుషి సినిమాకి 42 కోట్లు కలెక్షన్లు వచ్చాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు