Indraja Shankar : కనుల పండుగలా.. బిగిల్ నటి పెళ్ళి..!!

Indraja Shankar : ఈమధ్య సినీ ఇండస్ట్రీలో ఉండే చాలా మంది హీరో హీరోయిన్లు సైతం వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఒక తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషలలోని హీరోయిన్స్ అలాగే హీరోలు కూడా వివాహం చేసుకున్నారు.. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా కోలీవుడ్లో స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించిన నటుడు రోబో శంకర్ ఇంట పెళ్లి భాజాలు మోగాయి.. ఆయన కుమార్తె ఇంద్రజ శంకర్ (Indraja Shankar) వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది.. 20 ఏళ్ల వయసులోని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన డైరెక్టర్ కార్తీక్ ను ఈమె వివాహం చేసుకుంది.. వీరి నిశ్చితార్థ వేడుకలు ఫిబ్రవరి 2వ తేదీన చాలా గ్రాండ్గా జరిగాయి.

ఘనంగా నటుడు రోబో శంకర్ కుమార్తె పెళ్లి.

ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఇంద్రజ డైరెక్టర్ కార్తీక్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.చెన్నైలో వీరి వివాహానికి చాలామంది స్టార్స్ సైతం హాజరయ్యారు.. అలాగే తమ పెళ్లి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో ఇంద్రజ షేర్ చేస్తూ.. దేవుడు ఆశీస్సులతో ఇద్దరం ఒకటయ్యామంటూ కూడా రాసుకుంది.. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం వీరిద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వివాహం తర్వాత ఇంద్రజ సినిమాలలో నటిస్తుందా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది.

ఇంద్రజ సినీ కెరియర్..

ముఖ్యంగా నటుడు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ కూడా ఒక నటే… తండ్రిలాగే ఈమె కూడా కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నది.. ముఖ్యంగా తమిళ్ సినిమా అయిన బిగిల్ చిత్రం లో గుండమ్మగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది.. ఇక ఆ తర్వాత విశ్వక్ సేన్ నటించిన పాగల్ సినిమాలో కూడా విశ్వక్ తో ప్రేమలో పడే అమ్మాయిగా ఇంద్రజ కనిపించింది. ముఖ్యంగా విశ్వక్ సేన్ ఇంద్రజ మధ్య సాగే సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఈ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుందనే చెప్పాలి. అంతేకాదు ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఇంద్రజ శంకర్..

- Advertisement -

రోబో శంకర్ కెరియర్..

ఇంద్రజ తండ్రి శంకర్ కూడా తెలుగులో బాగా సుపరిచితమే ముఖ్యంగా ధనుష్ నటించిన మారి సినిమాలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.. మొదట మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్ ని మొదలుపెట్టిన శంకర్.. రోబో డాన్స్ ద్వారా రోబో శంకర్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.

అప్పుడే భర్తపై ప్రేమ కురిపిస్తున్న ఇంద్రజ..

ఇంద్రజ వివాహం తర్వాత తన భర్తకు గోరుముద్దలు తినిపిస్తున్నటువంటి ఒక వీడియోను కూడా షేర్ చేసింది. ఇప్పుడు రోబో శంకర్ కూడా తన కుమార్తెకు వివాహం చేసి తన బాధ్యతను సైతం నెరవేర్చుకున్నారు అనే చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు