Vijay Varma : తమన్నాతో నా ప్రయాణం అప్పుడే మొదలయ్యింది.. విజయ్ వర్మ కామెంట్స్..!!

Vijay Varma : టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న తమన్నా ప్రస్తుతం ఇతర భాషలలో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అలాగే పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ గ్లామర్ డోస్ పెంచేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. చివరిగా రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో తన అంద చందాలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఓటీటీ లో కూడా లస్ట్ స్టోరీస్ -2 లో కనిపించింది.. ప్రస్తుతం తమిళంలో అరుణ్మానై 4, స్త్రీ -2 చిత్రాలలో నటిస్తున్నది. ఇదంతా ఇలా ఉండగా తమన్నా.. ఇప్పుడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో (Vijay Varma) ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

తమన్నా ప్రేమ విషయాన్ని దాచి పెట్టిందా..

వీరిద్దరూ కలిసి ఇండస్ట్రీలో జరిగే ఎలాంటి ఈవెంట్స్, పార్టీలకైనా కలసి హాజరవుతూ ఒకే వేదిక పైన కనిపిస్తూ ఉంటారు. కానీ తమ మధ్య ఉన్న బంధాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ఇక ఎట్టకేలకు గత ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా తమ ప్రేమ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా ఇన్ డైరెక్ట్ గా తెలియజేసింది తమన్నా.. కానీ పెళ్లి గురించి మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్త వైరల్ అయింది.. అయితే వీరిద్దరి మధ్య పరిచయం ఎప్పటి నుంచి మొదలైంది అనే విషయాన్ని మాత్రం అభిమానులలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయం పైన నటుడు విజయ్ వర్మ (Vijay Varma), తమన్నాతో డేటింగ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

తమన్నాతో డేటింగ్ పై క్లారిటీ..

తాజాగా ఇండియా యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. లస్ట్ స్టోరీస్ -2 షూటింగ్ తరువాతనే తమన్నాతో.. తాను డేటింగ్ చేయటం ప్రారంభించామని తెలియజేశారు.. అయితే అంతకుముందు అంథాలజి చిత్రంలో కూడా కలిసి నటించామని తెలిపారు.. లస్ట్ స్టోరీస్ -2 తర్వాత డేటింగ్ ప్రారంభించాము.. ఆ సమయంలో ఒక ర్యాప్ పార్టీ జరగాల్సి ఉన్నది.. కానీ కొన్ని కారణాలవల్ల అది జరగలేదు.. దీంతో కేవలం మేము నలుగురం మాత్రమే పార్టీ చేసుకున్నామని తెలిపారు.ఆ సమయంలోనే తమన్నా తో నా గురించి చెప్పానని.. నేను మీతో ఎక్కువ సమయాన్ని గడపాలని కోరుకుంటున్నానని తమన్నా తో డైరెక్ట్ గా చెప్పేసానని విజయ్ వర్మ వెల్లడించారు.. అయితే ఆ తర్వాత తామిద్దరూ కలుసుకోవడానికి దాదాపుగా ఒక నెలరోజులు సమయం పట్టిందని తెలిపారు విజయ్ వర్మ.. అయితే న్యూ ఇయర్ పార్టీలో మాత్రం ఇద్దరూ కలిసి పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగా కనిపించడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ పలు రకాల రూమర్స్ కూడా వినిపించాయి.

- Advertisement -

డేటింగ్ రూమర్స్..

ఇక అప్పటి నుంచి పలు రకాల ఈవెంట్లతో పాటూ రెస్టారెంట్ లలో కూడా ఇద్దరు కలిసి కనిపించడంతో డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది.. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో తమన్నా విజయ్ తో ఉన్న బంధాన్ని కూడా తెలియజేసింది.. విజయ్ చివరిసారిగా మర్డర్ ముబారక్ అనే సినిమాలో కనిపించారు. ప్రస్తుతం మట్కింగ్ మీర్జాపూర్ సీజన్-3 లో నటిస్తున్నారు.. తమన్నా ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్లో నటిస్తున్నది.. ఇందులో తమన్నా అఘోర పాత్రలో కనిపించబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు