Mass Maharaj: మాస్ కాంబినేషన్ నుండి మరో బ్లాక్ బస్టర్ లోడింగ్..!

ఇటీవల రావణాసుర సినిమా ద్వారా డిజాస్టర్ అందుకున్న రవితేజ, ఆ ప్రభావం లేకుండా వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ వెళ్తున్నాడు. ఇప్పటికే టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ మరో ప్రాజెక్ట్ ని లైన్లో పెడుతున్నాడని సమాచారం అందుతోంది. రవితేజ నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ లతో ఉండబోతుందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో మైత్రి మూవీస్ నుండి వచ్చిన అప్డేట్ ఈ కాంబినేషన్లపై ఆసక్తి పెంచేస్తోంది. ఈ అప్డేట్ రవితేజ, హరీష్ శంకర్ సినిమా గురించే అని కొంతమంది, రవితేజ, గోపీచంద్ మలినేని సినిమా గురించే అని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు.

వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం రవితేజ నెక్స్ట్ సినిమా హరీష్ శంకర్ లేదా గోపీచంద్ మలినేనిలతో ఏ ఒక్కరితో అయినా కూడా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. రవితేజ గోపీచంద్ కాంబినేషన్లో గతంలో క్రాక్, బలుపు, డాన్ శీను వంటి మాస్ కమర్షియల్ హిట్స్ ఉన్న నేపథ్యంలో ఈ కాంబినేషన్ కి మంచి హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరో పక్క హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్లో మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ ఉన్నందున ఈ కాంబినేషన్ కూడా పాజిటివ్ హైప్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.

జులై 9న 11:11 గంటలకి మ్యాసిప్ అప్డేట్ ఉంటుందంటూ మైత్రి సంస్థ చేసిన పోస్ట్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తున్న రవితేజ ఇటీవలే తన నెక్స్ట్ సినిమా ఈగల్ ని కూడా అనౌన్స్ చేసాడు. ఈ క్రమంలో రవితేజ మరో ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ వస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో డిజాస్టర్ వచ్చినా రవితేజ స్పీడ్ తగ్గలేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు