Guntur Kaaram: సంక్రాంతికి వస్తారా బాబు.?

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “గుంటూరు కారం”. ఈ సినిమాపై అందరికి మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు అని చెప్పొచ్చు. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బకెట్ తన్నేసిన , టీవిలో మాత్రం మంచి టీఆర్పీ ను తెచ్చిపెట్టాయి. అలానే ఎప్పుడు ఈ సినిమాలు టీవిలో ఇంటిల్లిపాదికి కొన్ని నవ్వులను కూడా తీసుకొస్తాయి.

త్రివిక్రమ్ ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు. ఈరోజుల్లో ఎటువంటి సందేహం లేకుండా ఫ్యామిలీ తో పాటు చూడగలిగే సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అవి త్రివిక్రమ్ సినిమాలు అని చెప్పొచ్చు. కానీ త్రివిక్రమ్ నుంచి సినిమా వచ్చి మూడు సంవత్సరాలు కావొస్తుంది. ఇప్పటి వరకు ఒక సినిమా లేదు. ప్రస్తుతం చేస్తున్న గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ కానుంది. విడుదల డేట్ ఫిక్స్ అయినా కూడా సినిమా కంప్లీట్ అవుతుందా లేదా అని చాలామందికి ఉన్న సందేహం. దీనికి కారణం ఈ సినిమా ఇప్పటికి మూడు సార్లు రిలీజ్ డేట్ ను మార్చడం.

ఇలా డేట్ మార్చడానికి కూడా పలు కారణాలు , మహేష్ వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత కూడా సినిమా షూటింగ్ స్పీడ్ అందుకోలేదు. కానీ ప్రస్తుతం మాత్రం స్పీడ్ ను పెంచారు.రీసెంట్ గా 7 రోజులు అనుకున్న ఒక షెడ్యూల్ ను 6 రోజులలోనే పూర్తిచేసారు. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జులై 8నుండి ప్రారంభం కానుంది. ఇదే స్పీడ్ ను కొనసాగిస్తే సినిమా సంక్రాంతికి రావడం పక్కా, లేదంటే ఇదివరకే వేసిన ఖర్చీఫ్ ను వేరే వాళ్లకి ఇవ్వడం తప్పదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు