Baby: మరొక కల్ట్ లవ్ స్టోరీ అవుతుందా..?

కలర్ ఫోటో సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సాయి రాజేష్ స్వీయ రచనతో దర్శకత్వం వహించిన ‘బేబీ’ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా స్టోరీ తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రాసుకున్న కథతో తెరకెక్కించానని సాయి రాజేష్  గతంలోనే క్లారిటీ ఇచ్చాడు.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ట్రైలర్ ఆద్యంతం ఫ్రెష్ ఫీల్ ఇస్తూ సినిమాపై ఆసక్తి పెంచే విధంగా ఉంది.

ట్రైలర్లో సినిమా కథ గురించి ఒక క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ సినిమా క్లైమాక్స్ ఆసక్తిని పెంచేసాడు. బిగినింగ్ టు ది ఎండ్ హార్ట్ టచింగ్ బీజీఎమ్ తో ట్రైలర్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఈ సినిమా ద్వారా ఆనంద్ దేవరకొండ నటుడిగా మరో మెట్టు ఎక్కాడని అనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి, మూడు వైరియేషన్స్ లో అద్భుతంగా నటించి ఆకట్టుకుంటోంది. చూస్తుంటే ఈ సినిమా మరొక కలర్ ఫోటో అవ్వటం ఖాయం అని అనిపిస్తుంది.

తొలి సినిమా నుండి ఔట్ ఆఫ్ ది బాక్స్ కథలను ట్రై చేయకుండా తన లుక్స్ కి, బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు కథలు ఎంచుకుంటూ వస్తున్న ఆనంద్ దేవరకొండకి బేబీ సినిమా బ్లాక్ బస్టర్ ఇస్తుందన్న నమ్మకం కలుగుతోంది ఈ ట్రైలర్ చూస్తుంటే. నేషనల్ అవార్డు గ్రహీత నుండి వస్తున్న సినిమా కావటంతో నెలకొన్న భారీ అంచనాలను బేబీ చేరుకుంటుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు