RC16: బాబాయ్ తర్వాత మళ్ళీ  అబ్బాయికే..!

ఏ ఆర్ రెహమాన్ సంగీత ప్రపంచంలో ఒక అల, ఇండియన్ సినిమా పాటకు మొదటి ఆస్కార్ ను తీసుకొచ్చిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టిన ఈ ఇళయరాజా శిష్యుడు అతి తక్కువకాలంలోనే అత్యద్భుతమైన పాటలను అందించాడు. మాములుగా ఒక పాటలో పల్లవి బాగుంటుది, లేదంటే చరణం బాగుంటుంది కానీ ఏ ఆర్ రెహమాన్ కంపోస్ చేసే పాట మొత్తం బాగుటుంది.

రెహమాన్ , మణిరత్నం కాంబినేషన్ ఒక సంచలనం. ఈ కాంబినేషన్ లో అద్భుతమైన సినిమాలు, పాటలు వచ్చాయి. రెహమాన్ తెలుగులో మ్యూజిక్ డైరెక్షన్ సినిమాలు చాలా తక్కువ “నీ మనసు నాకు తెలుసు” “నాని” “ఏ మాయ చేసావే” “కొమరం పులి” వంటి సినిమాలు చేసారు.
తెలుగులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన “సాహసమే శ్వాసగా సాగిపో” సినిమా తరువాత ఇప్పటివరకు రెహమాన్ తెలుగు సినిమాకి సంగీతం అందించలేదు. ఆ సినిమా కూడా తమిళ్ సినిమా రీమేక్ కాబట్టి, దానిని పరిగణలోకి తీసుకోలేము.

ప్రస్తుతం రెహమాన్, రామ్ చరణ్ సినిమాకి సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజెర్” సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేయనున్నాడు చరణ్. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ సినిమా రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తుంది . దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. మరి, ఏఆర్ రెహమాన్ తెలుగులో సంగీతం అందించిన స్ట్రైట్ సినిమాల్లో కమర్షియల్ సక్సెస్ ఒక్కటి కూడా లేని నేపథ్యంలో రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రానున్న సినిమాకు ఏ మేరకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు