Akhil: ఏజెంట్ సినిమా ఫలితం ఆ స్టార్ హీరోల వెన్నులో వనుకు పుట్టించిందట..?

ఇటీవలి కాలంలో మన టాలీవుడ్ స్టార్లు కొత్త పంధాని ఎంచుకున్నారు. స్పై త్రిలర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. గూడచారులుగా, నిఘా ఏజెంట్లుగా, సెక్యూరిటీ కమాండోలు గా మనకు కిక్ ఇచ్చేందుకు వస్తున్నారు. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్స్ క్రియేట్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయాలని భావిస్తున్నారు. అయితే వీటిలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తే.. మరికొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తున్నాయి. ఈ కోవకు చెందిన మూవీనే ఏజెంట్.

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీ ఫలితంతో స్పై సినిమాలు చేస్తున్న హీరోలందరూ ఇప్పుడు ఓ ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే కార్తికేయ, 18 పేజెస్ వంటి సినిమాలతో వరుస హిట్స్ సాధించిన నిఖిల్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో స్పై మూవీ ఒకటి. గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని హై వోల్టేజ్ ఆక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. మరోవైపు గూడచారి చిత్రం అడవి శేష్ కెరీర్ లో ఒక మైలురాయి. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రెడీ చేస్తున్నారు. వినయ్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం జీ2 గా తెరకెక్కుతోంది. గూడచారి చిత్రానికి మించి ఈసారి అంతర్జాతీయ స్థాయిలో జరిగే కథతో జీ 2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇక ఇప్పటివరకు రకరకాల పాత్రలు చేసిన నందమూరి కళ్యాణ్ రామ్ మొదటిసారి స్పై నేపథ్యంలో డెవిల్ అనే మూవీ చేస్తున్నాడు. 1945 లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక మరోవైపు ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో గాండీవదారి అర్జున అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అయితే ఏజెంట్ సినిమా ఫలితంతో ఇప్పుడు ఈ స్టార్ హీరోలు అందరూ వారి వారి సినిమాలను మరోసారి రీ చెక్ చేసుకోవాలని భావిస్తున్నారట. ఏజెంట్ ఇచ్చిన షాక్ తో స్పై సినిమాలు చేస్తున్న హీరోలందరూ అలర్ట్ అయ్యారని.. అవసరమైతే రీషూట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు