PS2 : తన కొడుకుని పరిచయం చేస్తూ ఫోటో షేర్ చేసిన త్రిష

‘నీ మనసు నాకు తెలుసు’ అనే తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై.. ‘వర్షం’ సినిమాతో మొదటి కమర్షియల్ సక్సెస్ అందుకున్న త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈ సినిమాతోనే ఆమె తొలిసారి ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. కాగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ చెన్నై ముద్దుగుమ్మ.. సెకండ్ ఇన్నింగ్స్ లోను అదే విధంగా ఇండస్ట్రీని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి తెగ ట్రై చేస్తోంది. పెరుగుతున్న కాంపిటీషన్ కి కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందాన్ని మెయింటైన్ చేస్తూ కుర్రకారుని టెమ్ట్ చేస్తోంది.

పొన్నియన్ సెల్వన్ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన త్రిష.. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస క్రేజీ ఆఫర్లు పట్టేసి కోలీవుడ్ మీడియాని షేక్ చేస్తోంది. అయితే ప్రస్తుతం మరోసారి హీరోయిన్ ఓరియంటెడ్ కధా చిత్రంతో తెరపైకి రావడానికి సిద్ధమవుతుంది త్రిష. ఆమె నటించిన ‘ది రోడ్’ అనే సినిమా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలకు ముస్తాబవుతుంది. ఏఏఏ సినిమా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్ వశీకరణ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కొడుకుగా ఓ చంటి పిల్లాడు నటిస్తున్నాడు.

అయితే ఈ బుడ్డోడితో ఆమె దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. నెటిజెన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. త్రిషకి ఇంకా పెళ్లి కాలేదు కదా అలాంటప్పుడు కొడుకు ఎక్కడినుండి వచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆ తరువాత అసలు విషయం తెలుసుకొని ఈ మూవీ సక్సెస్ కావాలని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు