Gopichand: రామబాణం డిజాస్టర్ ను ఈ మెగా హీరో రిజెక్ట్ చేసి మంచి పనే చేశాడు

మ్యాచో స్టార్ గోపిచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం రామబాణం. వీరి కాంబోలో ఇప్పటికే వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలో మంచి విజయాన్ని సాధించాయి. ఈ నేపథ్యంలో వారి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రంపై అంచనాలు భారీగా ఉండేవి. కానీ, గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం, ఫస్ట్ షో తోనే తెలిపోయింది. రోటీన్ డ్రామా అంటూ నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో ఉన్న ఫ్యామిలీ డ్రామా గానీ, యాక్షన్ ఎపిసోడ్స్ గానీ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేవని విశ్లేషకులు బాహాటంగానే చెబుతున్నారు. స్టోరీని రాముడికి ఇచ్చేసి బాణాన్ని ప్రేక్షకులకు దింపారు అంటూ మీమర్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే రామబాణం కథను గోపిచంద్ కోసం శ్రీవాస్ సిద్ధం చేయలేదట. ఈ ముందుకు ఈ కథను మెగా కంపౌండ్ లో ఒక హీరోతో చేయాలని అనుకున్నారట. ఆ హీరో ఎవరో కాదు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. రామబాణం కథను ముందుగా, వరుణ్ తేజ్ కు శ్రీవాస్ వినిపించారట. అతిగా ఫ్యామిలీ డ్రామా, మితి మీరిన ఎమోషన్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటం వల్ల, తనకు ఇది సెట్ అవదన వరుణ్ తేజ్ ఓపెన్ గా చెప్పేశారట.

దీంతో శ్రీవాస్.. మెగా కంపౌండ్ నుంచి బయటకు వచ్చి, తనకు లక్కీ హ్యాండ్ గా ఉన్న గోపిచంద్ కు రామబాణం కథను చెప్పారట. మ్యచో స్టార్ కి కథ నచ్చడంతో వెంటనే ఒకే చేశాడు. ఆ వెంటనే షూటింగ్.. రిలీజ్.. ఫలితం మాత్రం డిజాస్టర్. గోపిచంద్ కెరీర్ లో చాలా వరకు ఫెయిల్ సినిమాలు ఉన్నాయి. కానీ, రామబాణం ప్రభావం మాత్రం కాస్త ఎక్కువే ఉంది. అయితే రామబాణం ఫలితాన్ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముందే ఊహించాడని, అందుకే రిజక్ట్ చేశారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. వరుణ్ తేజ్ ఈ చిత్రం చేసి ఉంటే, ఆయన కెరీర్ కే పెద్ద డిజాస్టర్ వచ్చేది అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు