Box office: గోపీచంద్,నరేష్ సినిమాల వీకెండ్ కలెక్షన్స్.. ఒక సినిమా ఔట్..

మే5 న తెలుగులో రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన రామబాణం సినిమాకాగా, ఇంకోటి అల్లరి నరేష్ నటించిన ఉగ్రం. ఎన్నో అంచనాలతో విడుదలైన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయాయి. రామబాణం డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా, ఉగ్రం సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన తొలి రెండురోజులు బాక్స్ ఆఫీస్ వద్ద డల్ గానే పెర్ఫార్మన్స్ ఇవ్వగా, మూడో రోజు ఆదివారం కావడంతో టాక్ ఎలా ఉన్నా మినిమం గ్రోత్ చూపిస్తుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మూడో రోజు తెలుగు రాష్టాల్లో కనీసం కోటి రూపాయలు కూడా వసూలు చేయలేకపోయాయి.

రామబాణం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రెండు రోజుల్లో 1.98 కోట్ల షేర్ రాబట్టరాగా మూడో రోజు 65 లక్షల షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా మూడురోజుల్లో రామబాణం 2.79 కోట్ల షేర్ వసూలు చేయగా, బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా 12.41 కోట్లు కావాలి. వీకెండ్ కూడా పూర్తయింది కాబట్టి ఈ టార్గెట్ ని ఇక చేరుకోదనే చెప్పాలి.

ఇక ఉగ్రం సినిమా మొదటి రెండురోజుల్లో 1.48 లక్షల షేర్ సాధించగా, మూడో రోజు 60లక్షల షేర్ ని సాధించింది. వీకెండ్ ముగిసే సరికి ఏపీ, నైజాం లో 2.10 కోట్ల షేర్ సాధించగా, 4.50కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఉగ్రం 6.50 కోట్ల టార్గెట్ తో విడుదల కాగా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 4.40 కోట్ల షేర్ రాబట్టాలి. ఇక మొదటి వారం ముగిసే సరికి ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు