Box office: రిలీజై రెండు వారాలైంది. మొన్నొచ్చిన వాటికన్నా ఎక్కువ కలెక్షన్లు

విరూపాక్ష సినిమా విడుదలై రెండు వారాలు దాటినా కలెక్షన్ల జోరు ఆపడం లేదు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలైన బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రెండు వారాల్లో 40 కోట్లకి పైగా షేర్ రాబట్టిన ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లు రాబడుతుంది. విరూపాక్ష మే5 న తమిళ,మలయాళ, హిందీలోను విడుదలై సక్సెస్ ఫుల్ గా ఆడుతుంది.

విరూపాక్ష మూవీ విడుదలైన 17రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో భారీ కలెక్షన్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 17రోజు 85లక్షలకు పైగా షేర్ రాబట్టిన ఈ సినిమా, రీసెంట్ గా రిలీజైన రామబాణం, ఉగ్రం సినిమాలకంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది. రామబాణం 65L రాబట్టగా, ఉగ్రం 60L వసూలు చేసింది. ఇక విరూపాక్ష ఇతర భాషలతో కలిపి వరల్డ్ వైడ్ గా 17వ రోజు 1.27కోట్ల షేర్ వసూలు చేసింది.

కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించగా, ఓవరాల్ గా విడుదలైన 17 రోజుల్లో విరూపాక్ష ప్రపంచ వ్యాప్తంగా 44.97 కోట్ల షేర్ వసూలు చేయగా 85 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టింది. హిందీలోనూ ఈ సినిమాను ఆదరిస్తే ఆ కలెక్షన్స్ తో కలిపి విరూపాక్ష లాంగ్ రన్ లో 100 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. అయితే మే 12 న విడుదలవుతున్న కస్టడీ మూవీని తట్టుకుని విరూపాక్ష నిలబడుతుందా లేదా? అన్నది తెలియాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు