Jacqueline: బాలీవుడ్ బ్యూటీకి లవ్ లెటర్.. తీహార్ ఖైదీ నుంచి ప్రేమ కావ్యం

జాక్వలిన్ ఫెర్నాండజ్… తాను చేసే సినిమాలు, ఐటెం సాంగ్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది ఈ శ్రీలంకన్ బ్యూటీ. అయితే ఈ మధ్య కాలంలో కేసులు, కోర్టులు, ఈడీ దాడులు అంటూ వచ్చే కేసుల్లో కూడా ఈ బాలీవుడ్ బ్యూటీ పేరు గట్టిగా వినిపిస్తుంది. 200 కోట్ల మనీ లాండిరింగ్ కేసులో సుఖేష్ చంద్ర శేఖర్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. సుఖేష్ కి జాక్వలిన్ కు సన్నిహిత సంబంధం ఉందన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. వీరి ప్రయివేటు ఫోటోలు కూడా అప్పట్లో నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి.

ఈ మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండజ్ ప్రమేయం ఉందని అధికారలు అనుమానిస్తున్నారు. అంతే కాదు. ఈ కేసులో నిందితులు లిస్ట్ లో జాక్వలిన్ పేరును కూడా చేర్చారు. ఈ కథంతా పక్కన పెడితే, సుఖేష్ జైలులో ఉన్నా, తన ప్రేయసి జాక్వలిన్ పై ఇష్టాన్ని మాత్రం చంపుకోలేక పోతున్నాడు. తన లవర్ జాక్వలిన్ కు వరుసగా లవ్ లెటర్స్ రాస్తున్నాడు. ప్రస్తుతం ఈ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి హాడావుడి కాస్త ఎక్కువనే ఉంది. కానీ, సుఖేష్ అవేవీ పట్టించుకోకుండా తనలో ఉన్న ప్రేమ ఖైదీని నిద్రలేపి జాక్వలిన్ కు ప్రేమ కావ్యాలు రాస్తున్నాడు. ఇప్పటికే చాలా లెటర్స్ పంపించిన సుఖేష్, తాజాగా మరో లెటర్ ను కూడా పంపించాడు.

ఈ లెటర్ లో.. నా ప్రేయసి జాక్వలిన్ ను తన పుట్టిన రోజు ఏప్రిల్ 28న ఫిల్మ్ ఫేర్ అవార్డులో చూశాను. నీవు చాలా అద్భుతంగా కనిపించావు. నీ డ్యాన్స్ ఫర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. దీంతో నేను మరోసారి నీ ప్రేమలో పడిపోయాను అంటూ సుఖేష్ రాసుకొచ్చాడు.

- Advertisement -

అలాగే “నిన్ను పొందేందుకు నేను ఒక మంచి పని చేశాను. నా రాణి, నా బొమ్మ, నా శరీరంలోని ప్రతి కణం నిన్ను ప్రేమిస్తుంది. నా జీవితంలో ప్రతీ సెకను నీ గురించే ఆలోచిస్తాను. నేను నిన్ను ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నానో, నువ్వు నన్ను ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నావో తెలుసు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను” అంటూ జాక్వలిన్ పై ఉన్న ప్రేమను సుఖేష్ చూపించాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు