Jayapradha: హీరోయిన్ జయప్రద ను అరెస్ట్ చేయడానికి సిద్ధం అయిన ప్రత్యేక బృందం..!!

Jayapradha:తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన హీరోయిన్లలో అలనాటి హీరోయిన్ జయప్రద కూడా ఒకరు.. సినీ గ్లామర్ కు పొలిటికల్ పరంగా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పవచ్చు.. తాజాగా హీరోయిన్ జయప్రద గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే జయప్రదను పోలీసులు వెతుకుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమెను వెతకడానికి గల కారణాలు ఏంటి అనే విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

సినీ ఇండస్ట్రీలోనే కాకుండా జయప్రద పొలిటికల్ పరంగా.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక జయప్రద పొలిటికల్ విషయానికి వస్తే..1994లో తెలుగుదేశం పార్టీలో చేరింది. అయితే ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే ఆ పార్టీ వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరింది.. 2004 నుంచి 2014 వరకు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేసింది. ఆ తర్వాత 2019 నుంచి బిజెపిలో కొనసాగుతోంది.. 2019 ఎన్నికల సందర్భంగా ఈమె నిబంధనలను ఉల్లంఘించిందని జయప్రద పైన నాన్ బెయిలబుల్ వారంటీ జారీ అయ్యింది.

ఈ కేసులో భాగంగా ఈమెకు కోర్టు సమన్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.. అయితే జయప్రద మాత్రం న్యాయస్థానానికి హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆగ్రహం చెందడంతో ప్రత్యేక టీమును ఏర్పాటు చేసి ఈమెను అరెస్టు చేయాలంటూ కూడా ఉత్తరప్రదేశ్ లోని పోలీసులకి పలు రకాల ఉత్తర్వులను జారీ చేసింది కోర్టు.ఈ క్రమంలోనే మహిళ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కలిసి ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసి జయప్రద ను త్వరలోనే అరెస్టు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

జయప్రద యూపీ లోక్సభ ఎన్నికలలో రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. జయప్రద ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఆజామ్ ఖాన్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. మరి ఈ కేసు పైన జయప్రద ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. ఇక జయప్రద సినిమాల విషయానికొస్తే ఒకానొక సమయంలో చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన భారీ ఇమేజ్ దక్కించుకున్న ఈమె అవకాశాలు తగ్గినప్పుడు రాజకీయాలలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం రాజకీయాలలోనే కొనసాగుతోంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు